‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్ : మరో RX100 వచ్చేసింది!

యూట్యూబ్ లోకి తెలుగు మాస్ మసాలా రొమాన్స్ తో నిండిన మరో సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఆ సినిమా పేరు డిగ్రీ కాలేజ్. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100లాగే… తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మరో కల్ట్ సినిమా లాగే ఉంది. ట్రైలర్ చూస్తే ఎవరికైనా ఈ మూవీ ట్రైలర్ లో చూపించిన సీన్స్ అలర్ట్ చేయకమానవు.

మొక్కజొన్న తోటల్లో.. క్లాస్ రూమ్ లో.. బీచ్ లో.. చెరువు గట్టున.. ఇలా… ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ చూపించాడు. రొమాన్స్ చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అని హీరోయిన్ డైలాగ్ ఒకటుంది. దాన్ని శాటిస్ ఫై చేస్తూ.. కొన్ని సీన్స్ పెట్టాడు డైరెక్టర్. రెండున్నర నిమిషాలున్న ట్రైలర్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

నంది నర్సింహ ఈ మూవీ డైరెక్టర్. 1940లో ఒక గ్రామం లాంటి జాతీయ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించిన డైరెక్టర్ ఈ డిగ్రీ కాలేజ్ సినిమాను తీశాడు. ఈ మూవీ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన ప్రేమ కథ గా చెబుతున్నాడు దర్శకుడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. తెలంగాణలో చాలా క్యాజువల్ గా వాడే బూతులు ట్రైలర్ లో వినిపించడంతో… ఆటోమేటిక్ గా ఇండస్ట్రీలో బజ్ క్రియేటయింది. వరుణ్, శ్రీదివ్య ఈ మూవీలో హీరోహీరోయిన్లు. అందరూ కొత్తవాళ్లతోనే తీసిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.