డియర్ ప్రైమ్ మినిస్టర్.. నా పేరు సౌమ్యతరిణి మిశ్రా..

dear-prime-minister-jnu-student-appeals-pm-for-fee-hike-rollback

డియర్ ప్రైమ్ మినిస్టర్

నా పేరు సౌమ్యతరిణి మిశ్రా. నేను ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంఏ లింగ్విస్టిక్స్ మొదటి సంవత్సరం చదువు కుంటున్న విద్యార్ధిని. భారతదేశంలోనే అత్యుత్తమమైనది భావించి నేను ఈ సంవత్సరం జెయెన్యూలో అడ్మిషన్ తీసుకొన్నాను. ఈ యూనివర్సిటీ అన్ని రకాల నేపథ్యాల నుండి వచ్చినవారికి అందుబాటులో విద్యను అందించగలదని భావించాను. ఈ యూనివర్సిటీ నెలకు 2000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తుంది కాబట్టి నేను భరించగలననుకొన్నాను. అందువలనే నేను ఇక్కడ ఉన్నాను.

జనం మాట్లాడేది తెలుగుకాదా?

కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నవన్నీ- నేనిక ఇక్కడ నా చదువును కొనసాగించలేనని, నేనిక్కడకి వచ్చే ముందు నాకున్న కలలు ఆకాంక్షలు ఇక నెరవేరవని చెబుతున్నాయి. ఇక్కడ పెంచిన అత్యధిక ఫీజ్ పెంపు ను చూస్తుంటే నాలో ఇక్కడకు రాక ముందు దాగి ఉన్న, ఇంకా ఉనికిలో ఉన్న నా స్వప్నాలను నేనిక వదులుకోవాలని అర్ధం అవుతుంది. నేనిక నా చదువును వదులుకోవాల్సిందే. ఇది నా ఒక్క దాని విషయమే కాదు. వేలాది నాలాంటి ఇతర విద్యార్ధుల విషయం కూడా.

విద్యార్థిని ఆవేధన

Dear Prime Minister: JNU Student Appeals PM For Fee Hike Rollback

“Dear Prime Minister, when you are introducing this fee hike, you are telling me that those naysayers to my dreams were correct and I was wrong.” A JNU student talks to Brut India about the university's fee hike.

Posted by Brut India on Wednesday, November 20, 2019

నేను చాలా పేద నేపథ్యం నుండి వచ్చాను. ఒరిస్సాలో ఒక గ్రామంలో ఉండేదాన్ని. మా నాన్న ఈ సంవత్సరం జనవరిలో చనిపోయాడు. అతనికి హేమీప్లీజియా అనే జబ్బు ఉండేది. అది శరీరం ఒక పార్శాన్ని నిస్తేజం చేస్తుంది. ఆ జబ్బుతో ఆయన గత 20 సంవత్సరాలుగా బాధ పడుతూ ఉండేవాడు. మా కుటుంబానికి ఒక స్థిరమైన ఆదాయం లేదు. మాకున్న ఏకైనా ఆదాయం వ్యవసాయాధారమైనది. అది పంటల రూపంలో వచ్చేది. వ్యాపార రూపంగా వచ్చేది కాదు.

12వ తరగతి వరకు నేను పూరీ జవహర్ విద్యాలయలో చదివాను. అది విద్యార్ధులకు ఉచిత విద్యనిస్తుంది. అందువలన నా కుటుంబం నా పాఠశాల విద్య గురించి ఇబ్బంది పడలేదు. తరువాత నేను కాలేజ్ లో చదివేటపుడు నా ఫీజ్ దాదాపు 2000 ఉండేది. నాకు కొంత స్కాలర్షిప్ వచ్చేది. కొన్ని ట్యూషన్స్ చెబుతూ నేను కుటుంబం మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని కాదు. నా కుటుంబానికి భారం కాకుండా కొద్దిగా స్వతంత్రంగా ఉంటూ నా అశక్తులను, కలలను కాపాడుకొనేదాన్ని. వారి ఆదాయంలో ఎక్కువ తీసుకోకుండా ఇదంతా జరిగింది.

చదువుల తల్లికి చెప్పుకోలేని కష్టం – నిరుపేద కుటుంబానికి శరాఘాతం

నేనిక్కడకు వచ్చినపుడు అదే జరుగుతుందని అనుకొన్నాను. నా హాస్టల్ ఫీస్ కు సరిపడా 2000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి, ఎక్కడైనా పార్ట్ టైమ్ గా పని చేస్తూ నా సొంత ఖర్చులకు సరిపడేంత సంపాదించుకోవచ్చుననుకొన్నాను. అంతా బాగా జరిగితే ఇప్పటికీ నేను నా కుటుంబానికి కూడా తిరిగి ఇవ్వగలిగి ఉండేదాన్ని.

కానీ ఇక్కడ పెంచిన అత్యధిక ఫీజుల వలన నేను చదువును ఇక వదిలేయాలనుకొంటాను. ఎందుకంటే నేనిక ఏమి చేసినా నెలకు 7000 రూపాయల ఫీజు కట్టి, నా సొంత ఖర్చులు భరిస్తూ నా చదువును కొనసాగించలేను. నా కలలను, ఆకాంక్షలను, జెయెన్యూ ను నేనిక వదిలేయాలి.

నేనిక్కడకు వచ్చే ముందు కొంత మంది ‘నీలాంటి నేపధ్యం ఉన్న వాళ్లు ఎమ్మే చేయటంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని’ అన్నారు. ఈ స్థితిలో ‘నువ్వు కొంత సంపాదించి నీ కుటుంబాన్ని ఆదుకోవాలని’ అన్నారు. కానీ వాళ్ల ముఖాల నుండి నా కలల గురించి వారికి తెలుసునని అర్థం చేసుకొన్నాను. నేను చేయగలనని నాకు తెలుసు. చేస్తాను కూడా. కానీ ఈ ఫీజు పెంపు ఒక రకంగా ఏమి చెబుతుందంటే నా కలలు వద్దన్నవాళ్లే కరక్టు, నేనే తప్పు అని చెబుతుంది.

ఇది నా ఒక్కదాని గురించే కాదు. ఇతర విద్యార్ధులు కూడా ఉన్నారు. వాళ్లూ వదిలేయాలి. నాలాంటి నేపధ్యం ఉన్నవాళ్లు కొంతమంది ఉన్నారు, నాకంటే దారుణమైన పరిస్తితి ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క హాస్టల్ ఫీజు కోసమే వాళ్లు 7000 రూపాయలు భరించలేరు. ఈ కొత్త ఫీజుల పెంపు ఎలాంటి మినహాయింపు ఇవ్వగలదో చెప్పటం లేదు. ఏవో కొన్ని మినహాయింపులు ఉంటాయని అస్పష్టంగా చెబుతుంది. అందరినీ కలుపుకొని పోయే వాతావరణాన్ని ఇది రద్దు చేస్తుంది.

నేను ఒక మహిళా విద్యార్ధినిని. నాలాంటి ఎంతో మంది విద్యార్ధునులు ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించటానికి కుటుంబంతో ఘర్షణ పడి ఉన్నారు. కూతురు చదువు కోసం వాళ్లు అంత ఎక్కువ డబ్బును వెచ్చిస్తారని నేను అనుకోవటం లేదు. అలాంటి వాళ్ళు కూడా చదువు వదిలేయాల్సిందే. నేను ఇక్కడ నుండి వెళ్లిపోయి ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఏమైనా చేయవచ్చు. కానీ చాలా మంది విద్యార్ధునులు వెనక్కి వెళ్లి బహుశా పెళ్లి చేసేసుకొంటారు. వారి కలలు ఆకాంక్షలు హత్య చేయబడతాయి.

ఈ హాస్టల్ మాన్యువల్ విద్యార్ధి వ్యతిరేకంగా ఉంది. విద్యకు వ్యతిరేకంగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మేము పోలీసు క్రూరత్వాన్ని- లాఠీ చార్జులు, వాటర్ కానూన్ల ప్రయోగం, గుడ్డి విద్యార్ధుల పొట్టలు ఛాతుల మీద నొక్కటాలు, మహిళా విద్యార్ధులను పురుష స్త్రీ పోలీసులు మాన్ హాండ్ లింగ్ చేయటాన్నిచవి చూసాము.

ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపటం నాకిష్టం లేదు. ‘మేము భరించగలిగే విద్యను ఇవ్వటం లేదు, అడిగిన వాళ్లను అణచివేస్తున్నారు’ అనే సందేశాన్ని నేను బయటకు పంపటం నాకు ఇష్టం లేదు.

….. రమాసుందరి గారి ఫేస్ బుక్ వాల్ నుంచి