కిస్సులతో హీటెక్కిస్తున్న కామ్రేడ్

dear comrade

విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి రెచ్చిపోయాడు. డియర్ కామ్రేడ్ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత యూత్ అయితే ఊగిపోవ‌డం ఖాయం. మ‌రోసారి అదే ఆవేశం.. అవే ముద్దులు.. అదే కాలేజ్ బ్యాక్ డ్రాప్.. శివ టైప్ కాలేజ్ పాలిటిక్స్ అన్ని క‌లిపి డియ‌ర్ కామ్రేడ్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి.

అర్జున్ రెడ్డి సినిమా చూసిన‌పుడు ఇలాంటి.. అన్ని మసాలాలు కలగలిసిన సినిమా రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నారు. కానీ.. అంత ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి రికార్డ్ డియర్ కామ్రేడ్ బ్రేక్ చేసేలా ఉన్నాడనిపిస్తోంది.

Read Also : మేం స్నేహాన్ని కోరుకుంటున్నాం

క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రోసారి చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తున్నాడు ఈ కుర్ర హీరో. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ నాలుగు భాష‌ల్లో విడుద‌లైంది.

dear comrade 11

Read Also : గుండెల్లో కన్నీటి వరద

Also Read : వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

అర్జున్ రెడ్డి మాదిరే మూడు నిమిషాల ట్రైల‌ర్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌. అందులోనే క‌థ అంతా చెప్పాడు. ముందు కామ్రేడ్ పోరాటం.. ఆ త‌ర్వాత ఆవేశం ఉన్న యువ‌కుడిగా విజ‌య్.. కాలేజ్ ఎపిసోడ్స్.. ప్రేమ‌.. విడిపోవ‌డం.. మ‌ధ్య‌లో గొడ‌వ‌లు.. చివ‌ర్లో మ‌ళ్లీ మారిన మ‌నిషిగా ప్ర‌యాణం.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి ట్రైల‌ర్లో హైలైట్ చేశాడు. జులై 26న డియ‌ర్ కామ్రేడ్ విడుద‌ల కానుంది.

Read Also : సర్టిఫికేట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్