Darbar Review: బోణి కొట్టిన దర్బార్

సింగం సినిమాను కొంచెం ఆదర్శంగా తీసుకున్న ఈ సినిమాలో ఓ నాలుగు మంచి పాటలు,కొంత కామెడీ ఉంటే ఎక్కడికో వెళ్లిపోయేది..

రజనీ దర్బార్ … అభిమానులకు సూపర్..
కబాలి,కాలా, పేట…దర్శకుల ప్రతిభ రజనీ మానియా ముందు వెలవెలబోయింది.. ఇక్కడ మురుగదాస్ ఒక్కడే రజనీని తట్టుకుని కొంతసేపైనా నిలబడగలిగాడు.. అక్కడక్కడా మురుగదాస్ కూడా ఇబ్బంది పడినట్లే కనిపించింది..

ఇమేజ్ చట్రం ముందు ఎంతటి క్రియేటర్ అయినా తడబడాల్సిందే.. రజనీ మార్క్ బాగుంది కానీ మురుగదాస్ మార్క్ మిస్సైయింది.. ఖచ్చితంగా ఈమధ్య వచ్చిన రజనీ సినిమాలు దర్బార్ స్థాయిలో అసలు లేవు.. సింగం సినిమాను కొంచెం ఆదర్శంగా తీసుకున్న ఈ సినిమాలో ఓ నాలుగు మంచి పాటలు,కొంత కామెడీ ఉంటే ఎక్కడికో వెళ్లిపోయేది..

అనిరుద్ సంగీతం ఆర్ ఆర్ బాగున్నా పాటల విషయంలో తమిళ ఆడియన్స్ నే దృష్టిలో పెట్టుకున్నట్టు ఉంది..అలాగే విలన్ కు ,హీరోకు మధ్య కొన్ని బలమైన సన్నివేశాలు ఉంటే ఇంకా రసవత్తరంగా ఉండేది…దళపతి చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ మళ్ళీ ఆరోజుల్లో రజనీనే మనకు చూపించాడు..

సినిమాలో నయనతార అనవసరం.. ఏదో నామ్ కే వాస్తే.. నివేదా థామస్, రజనీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.. ప్రథమార్థంలో బాగానే స్పీడందుకున్నా ప్రీ క్లయిమాక్స్ లో కొద్దిగా డల్ అవుతుంది.. ఇక రొటీన్ క్లయిమాక్స్..

మొత్తానికి రజనీ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో అన్నీ పుష్కలంగా ఉన్నాయి దర్బారులో.. నాకైతే ఈవయసులో రజనీ పడ్డ కష్టం కనిపించింది.. మన వెటరన్ హీరోలు ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాల్సిందే..చివరగా మురుగదాస్ దర్శకత్వ ప్రతిభను ఫోటోగ్రఫీ,కాస్ట్యూమ్స్,మేకప్ డిపార్ట్మెంట్లు డామినేట్ చేశాయి…ఏదేమైనా పండుగకు మంచి బోణీ దొరికింది.

..గరగ త్రినాధరావు