కార్మికులు రేపు విధుల్లో చేరండి : సీఎం

ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. రేపు ఉదయం కార్మికులంతా విధుల్లో చేరాలని సూచించారు.

cm-kcr-allowed-rtc-employees-to-join-in-duties

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. రేపు ఉదయం కార్మికులంతా విధుల్లో చేరాలని సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం రేపు ఉదయం వరకు వందకోట్లు విడుల చేస్తామని చెప్పారు.

RGV.. మరోసారి బాబు, పవన్ టార్గెట్

ఆర్టీసీ సంస్థ బతకాలన్నదే తమ ఉద్దేశం అన్నారు సీఎం కేసీఆర్. త్వరలో తానే స్వయంగా కార్మికులతో మాట్లాడతానన్నారు సీఎం. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను పిలిచి ప్రగతిభవన్  లో మాట్లాడతానన్నారు. అలాగే.. సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే.. యూనియన్లను మాత్రం దగ్గరకు రానివ్వబోమని చెప్పారు. యూనియన్లు లేకుండా ఎలా అని కార్మికులు ఆందోళన వద్దని చెప్పారు. డిపోకు ఇద్దరు కార్మికులతో డెవలప్ మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కార్మికుల సంక్షేమం బాధ్యత తాము తీసుకుంటామని.. ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు.