Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!
Cinema Latest

Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!

Chiranjeevi – pawan Kalyan : రీమేక్ లతో సేఫ్ జోన్ గేమ్ ఆడడం పవన్ కి ముందు నుంచి అలవాటే.. పవన్ చేసిన అన్ని సినిమాలు దాదాపు రీమేక్ లే.. అవే హిట్లు కూడా.. రీఎంట్రీ తర్వాత చిరంజీవి(Chiranjeevi – pawan Kalyan) కూడా పవన్ ని ఫాలో అవుతున్నాడు. వరుస పెట్టి రీమేక్ లకి పచ్చాజెండా ఊపుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న లుసిఫర్, భోలాశంకర్ సినిమాలు కూడా రీమేక్ లే. ఇది కాకుండా ప్రభుదేవా డైరెక్షన్ లో మరో రీమేక్ కి చిరు ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు కథలు చర్చలో ఉన్నాయి.

అటు పవన్ కూడా రీఎంట్రీ రీమేక్ తోనే వచ్చాడు.. అదే వకీల్ సాబ్. ఇప్పుడు చేస్తున్న భీమ్లా నాయక్ కూడా రీమేకే. త్వరలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో మరో రీమేక్ సినిమాకి పవన్ ఒకే చెప్పినట్టు బోగోట్టా.. ఇలా అన్నదమ్ములిద్దరూ వరుస రీమేక్ లతో పోటీపడుతున్నారు. ఇండస్ట్రీ ఎప్పుడైనా కొత్త కథలు, కొత్త దర్శకులు వచ్చినప్పుడే కళకళాడుతుంది. కానీ అందుకు భిన్నంగా పరభాష సినిమాల కథలను తీసుకొని సినిమాలు చేయడం దేనికి సంకేతం.

చిరంజీవితో ఆ మధ్య సినిమా చేయాలనీ చెప్పులు అరిగేలా తిరిగాడు పూరి జగన్నాధ్. ఓ రెండు మూడు కథలు కూడా వినిపించాడు. సెకండ్ హాఫ్ బాలేదని మీడియా ముందు చెప్పేసి తప్పించుకున్నాడు చిరు. డైరెక్ట్ గా నాకు చెపితే మార్చేవాన్ని కదా అని పూరీ కూడా చెప్పుకొచ్చాడు. ఈ మాట అటుంచితే ఇప్పుడు పూరితో సినిమా చేసి, ఆ సినిమా ప్లాప్ అయితే చిరుకి వచ్చే నష్టం ఏంటి? మెగాస్టార్ కిరీటం అయితే ఏం పడిపోదు కదా.

ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడే చిరు.. ఓ కొత్త దర్శకుడితో పనిచేసిన సందర్భాలు అయితే మచ్చుకు కూడా లేవు. ఇందులో కొంచెం పవన్ బెటర్ అని చెప్పాలి. పూరీ, కరుణాకరన్ లాంటి డైరెక్టర్ లను ఎంకరేజ్ చేసి సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక కష్టమే. రీమేక్ లే ఎందుకు.. మనదగ్గర కథలు లేవా? రాసే రచయితలు లేరా? లేకా మనకంటే వాళ్ళే బెటర్ అని వారిని ఎంకరేజ్ చేస్తున్నారా? ఇండస్ట్రీకి తోపులు అని పిలిపించుకునే చిరు, పవన్ లే రీమేక్ లకి హైవే రోడ్డు వేస్తే కొత్త కథలు, కొత్త దర్శకులు ఎలా పుట్టుకొస్తారు.

ఇప్పటికే పరభాష నటులతో నిండిపోయి లోకల్ టాలెంట్ మరుగునపడుతుందన్న అపవాద ఎలాగు ఇండస్ట్రీకి ఉండనే ఉంది. ఇప్పుడు కథలు, దర్శకులు కూడా మరుగున పడే సమయం దగ్గరలోనే ఉందేమో..!

Also Read :