Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లోకి వచ్చేసింది.. కళావతి, మ..మ… మహేష్ పాటలతో, ట్రైలర్ తో భారీగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా మొత్తానికి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మహేష్ వన్ మ్యాన్ షో గానే సినిమా(Sarkaru Vaari Paata) మొత్తం నడిచింది.. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
ఏమైందో ఏమో కానీ ఈ సినిమా కోసం బాగా సన్నగా అయిపొయింది కీర్తి. ఫేస్ లో కళే పోయింది.. క్లోజప్ షార్ట్స్ లో అయితే మరి దారుణంగా కనిపించింది. ఇక కీర్తి గా ఫ్రెండ్ గా కనిపించిన ఓ అమ్మాయి మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిచింది. ఒకరకంగా చెప్పాలంటే కీర్తి కంటే సూపర్.. ఇంతకీ ఎవరీ అమ్మాయని ఆడియన్స్ కూడా సెర్చింగ్ కూడా మొదలుపెట్టారు.
ఆమె పేరు సౌమ్యమీనన్.. మలయాళీ అమ్మాయి.. కొంచెం నిధి అగర్వాల్ పోలికలు కనిపిస్తాయి.. . ట్రైలర్ లో కూడా ఆమెను చూపించారు. మలయాళంలో అరడజను సినిమాలు చేసిన సౌమ్య కన్నడలో హంటర్ అనే సినిమా చేసింది. తెలుగులో టాక్సీ అనే ఓ సినిమాకి ఓకే చెప్పింది కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు.. ఈ టైంలో సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఛాన్స్ కొట్టేసింది.
ఇందులో కూడా ఆమె పేరు సౌమ్యనే.. కానీ ఎక్కువగా ఆమె పాత్ర లేదు.. కానీ కనిపించిన కొద్దిసేపు మాత్రం మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం తెలుగులోనే లెహరాయి అనే మూవీ చేస్తోంది. చూడాలి మరి ఈమె టాలీవుడ్ లో ఏ మేరకు నిలబడుతుందో.
Also Read :
- Hyderabad : ఫేస్బుక్ పరిచయం… అక్రమసంబంధంతో ఇద్దరి జీవితం నాశనం చేసింది..!
- Padhu padmavathi : టిక్ టాక్ ఫేమ్ పద్దు.. మామూలుగా లేదు మరి..!
- Sarkaru Vaari Paata Review : సర్కారు వారి పాట హిట్టా.. ఫట్టా..!?