Masooda : హర్రర్ డ్రామాగా తెరకెక్కిన మసూద మూవీ మొత్తానికి ప్రేక్షకులని భయపెట్టి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మసూద(Masooda) ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచింది. మసూద ఏంట్రీనే ఆరాచకం. ఆ తరువాత మసూద చేసే ఆరాచకాలు వణుకు పుట్టిస్తాయి.
అయితే సినిమాలో ఆమె ఫేస్ మాత్రం ఎక్కడ కూడా కనిపించదు. బుర్కా కప్పుకుని మాత్రమే ఉంటుంది. దీంతో ఇంతకు ఆమె ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి సినిమా చూసిన వారిలో కలుగుతుంది. మసూద పాత్ర పోషించిన ఆ అమ్మాయి పేరు అఖిలా రామ్.
ఈమె హిందీలో లిఫ్ట్ 8055 లో నటించింది. తెలుగులో బాగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫొటోలు మాములుగా లేవు. ఇంత అందమైన అమ్మాయిని దెయ్యంగా ఎలా చూపించాడు డైరక్టర్ అని ప్రేక్షకులు కొందరు తిట్టుకుంటున్నారు.