Ramesh Babu : రమేష్ బాబు భార్య ఎవరు.. వ్యసనాలకి ఆయన ఎందుకు అలవాటు పడ్డారు?
Cinema Latest

Ramesh Babu : రమేష్ బాబు భార్య ఎవరు.. వ్యసనాలకి ఆయన ఎందుకు అలవాటు పడ్డారు?

Ramesh Babu : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సినీనటుడు రమేష్ బాబు(Ramesh Babu) నిన్న కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు మహప్రస్థానంలో ముగిశాయి. హీరో కృష్ణ తనయుడిగా రమేష్ బాబు అందరికి సుపరిచితుడు.

కృష్ణ హీరోగా వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఆ తరవాత 1987లో సామ్రాట్ చిత్రంతో హీరోగా మారాడు. జి. హనుమంతారావు నిర్మాణ సారథ్యంలో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఆ తర్వాత చిన్నికృష్ణుడు, బజారు రౌడీ, కృష్ణ గారి అబ్బాయి, మామాకోడలు, ఎన్‌కౌంటర్ చిత్రాలలో నటించాడు. హీరోగా పెద్దగా పాపులర్ కానీ రమేష్ బాబు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు.

హిందీలో 1999లో వచ్చిన సూర్యవంశం సినిమాకి సహనిర్మాతగా మారారు. ఈ సినిమా మంచి లాభాలే తెచ్చింది. ఆ తర్వాత 2004లో వచ్చిన అర్జున్ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇక 2007లో అతిథి చిత్రాన్ని నిర్మించారు. ఇక దూకుడు, ఆగడు చిత్రాలకి ప్రజెంటర్‌‌గా ఉన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ -ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు మొదటివాడు. ఆయన తరవాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు భర్య పేరు మృదుల.. వీరికి ఇద్దరు సంతానం.. భారతి, జయకృష్ణ.. హీరోగా ఫెడ్ అవుట్ అయ్యాక మీడియాకి, ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు రమేష్ బాబు.. ఫ్యామిలీ కూడా దూరంగానే ఉంటున్నారు.

కృష్ణ ఇంట్లో జరిగే ఫంక్షన్ లలో కూడా రమేష్ బాబు ఫ్యామిలీ తరచుగా కనిపిస్తుంటారు. సినిమాలకి దూరం అయ్యాక రమేష్ బాబు వ్యసనాలకి అలవాటు పడ్డారని, అందుకే ఆరోగ్యం దెబ్బతిందని తెలుస్తోంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Also Read :