Leena Manimekalai : ఇంతకీ ఎవరీ లీనా మణిమేకలై?
Cinema Latest

Leena Manimekalai : ఇంతకీ ఎవరీ లీనా మణిమేకలై?

Leena Manimekalai : ‘కాళీ’ డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. కాళీమాత అవతారంలో ఉన్న ఓ మహిళ సిగరెట్‌ తాగుతున్న ఫొటోను దర్శకురాలు లీనా మణిమేకలై (Leena Manimekalai)తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పోస్టర్‌తో హిందువుల మనోభావాలను కించపరిచిన డైరెక్టర్ లీనా మణిమెకలైని వెంటనే అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో లీనా మణిమేకలై పై ఢిల్లీ, యూపీతో పాటుగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

ఇంతకీ ఎవరీ లీనా మణిమేకలై?

మధురైలో జన్మించిన లీనా మణిమేకలైకు వివాదాలు కొత్తేమీ కాదు.

లీనా మణిమేకలై మధురైలోని మహారాజపురం అనే గ్రామంలో పుట్టింది. ఆమె తండ్రి ఓ కాలేజీ లెక్చరర్ గా పనిచేసేవారు. తన కుటుంబసభ్యులు పెళ్లికి ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న లీనా ఇంటిని వదిలి చెన్నైకి వెళ్లింది. అక్కడ ఓ తమిళ పత్రికలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. అమె ఇంటినుంచి పారిపోయి చెన్నైకు వచ్చిందని తెలుసుకున్న పత్రిక యాజమాన్యం ఆమెను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించింది.

ఆ తరువాత అమె ఇంజనీరింగ్ లో జాయిన్ అయింది. అయితే కాలేజీ చివరి సంవత్సరంలో ఆమె తన తండ్రిని కోల్పోయింది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి లీనా కొన్నాళ్లు బెంగళూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఆ తరువాత సమాజంలోని విస్మరించబడిన వర్గాల గొంతుకగా మారాలన్న ఆకాంక్షతో 2002లో సినిమాల్లోకి వచ్చింది. ఆమె చిత్రాలు వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి.

ఇప్పటికీ లీనా చేసే ప్రతి సినిమాకు ఫైనాన్స్ ప్రాబ్లమే. ఒకనోక టైమ్ లో ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్ధితి. దాదాపుగా లీనా చేసే ప్రతి సినిమా ఓ వివాదమే అవుతూ వచ్చింది. 2003లో ఆమె చేసిన మొదటి చిత్రం మాత్తమ్మ పెద్ద వివాదానికి దారితీసింది. 2004లో దళిత మహిళలపై ఆమె తీసిన మరో సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. ఇక 2011లో మత్స్యకారుల కష్టాలపై ‘సెంగాడల్’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన లీనా పెద్ద వివాదానికి తెర లేపింది.

సినిమాలో అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించారని పేర్కొంటూ సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఆమె అప్పీలేట్ ట్రిబ్యునల్ అధికారులకు అప్పీల్ చేసింది. చాలా నెలల పాటు ఈ కేసు పై లీనా న్యాయ పోరాటం చేసింది. చివరకు ఎటువంటి కట్స్ లేకుండా సర్టిఫికేట్ జారీ చేయాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు లభించిండం విశేషం.

Also Read :