RRR Malli : RRRలో ‘మల్లి’గా చేసిన ఈ పిల్ల ఎవరు..?
Cinema Latest

RRR Malli : RRRలో ‘మల్లి’గా చేసిన ఈ పిల్ల ఎవరు..?

RRR Malli : ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించే డిస్కషన్… ఎన్టీఆర్, చరణ్ మొదటిసారి కలిసి నటించడం, బాహుబలి లాంటి సెన్సేషన్ తర్వాత జక్కన్న డైరెక్షన్‌‌లో మూవీ వస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పైన ముందునుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. చరణ్, ఎన్టీఆర్‌‌ల నటనకి మాత్రమే కాకుండా సినిమాలోని చాలా పాత్రలకి మంచి పేరొచ్చింది. అందులో ఒకటి మల్లి పాత్ర(RRR Malli).

May be an image of 2 people, child, people standing and outdoors

సినిమా మొదలవ్వడమే ఆమెతోనే మొదలవుతోంది. గిరిజిన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తనతో పాటు తీసుకేల్తుంది. ఆ తర్వాత ఆమె కోసం ఢిల్లీకి భీమ్ (ఎన్టీఆర్ ) వెళ్ళడం.. అక్కడ రాజు (చరణ్ ) కలవడం.. ఆ ఇద్దరు కలిసి బ్రిటిష్ సైన్యం పైన దాడి చేసి అంతం చేయడంతో మూవీ ఫినిష్ అవుతోంది.

May be an image of 2 people and people standing

ఒక్క ముక్కలో చెప్పాలంటే మల్లికోసం, మట్టికోసం నడిచే కథే ఆర్ఆర్ఆర్. మల్లి పాత్రలో నటించిన ఆ అమ్మాయి పేరు పేరు ట్వింకిల్ శర్మ. అమెది చండీగఢ్‌.. ఈ పాత్రకి ఆమె కంటే ముందు దాదాపుగా 160మందిని ఆడిషన్ చేశాడు జక్కన్న.. ఫైనల్‌‌గా ఈమెను సెలెక్ట్ చేశాడు. ఈ సినిమాలో సెలెక్ట్ అయినప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదివేది.. ఇప్పుడు రిలీజ్ టైంకి ఆమె టెన్త్ క్లాస్ చదువుతోంది.

May be an image of 7 people, people standing, people sitting and outdoors

ట్వింకిల్ అంతకు ముందు డాన్స్ ఇండియా డాన్స్ అనే కాంపిటీషన్‌‌లో పాల్గొంది. ఎన్నో టీవీ షోస్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలలో కూడా నటించింది. ఆన్లైన్ యాడ్‌‌లో ఆమెను చూసిన రాజమౌళి ఆమెని ఆడిషన్‌‌కి పిలిచాడు.. చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లు కూడా రాజమౌళినే బుక్ చేసాడట.

May be a close-up of 1 person

తమిళ్ లాంగ్వేజ్‌‌లో ఆడిషన్ ఇచ్చింది ట్వింకిల్‌.. ఆమె యాక్టింగ్‌‌కి ఫిదా అయిన రాజమౌళి మల్లి పాత్రకు ఓకే చేశాడు. ఆమె నటనకి కూడా సినిమాలో కూడా మంచి మార్కులు పడ్డాయి.

May be an image of 2 people, people standing and indoor

Also Read :