who is bigg boss contestant lobo : లోబో అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. విచిత్రమైన వేషధారణతో వెరైటీ మనిషిగా కనిపిస్తుంటాడు. అదే లోబోకి ఉన్న ప్రత్యేకత. యాంకర్ గా మనకి పరిచయం ఉన్న లోబో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంటరయ్యాడు. అసలు ఈ లోబో ఎవరు.. అతని ఆసలు పేరేంటి..? ఎక్కడినుంచి వచ్చాడు.?
లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. హైదరాబాదులో 17 జూలై1982లో జన్మించాడు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. తొమ్మిదో తరగతిలో ఓ దొంగతనం చేసి దొరికిపోయాడు. దీనితో అతనికి టీసీ ఇచ్చి పంపించింది స్కూల్ యాజమాన్యం. మనోడి చదువు అక్కడే ఆగిపోయింది.
లోబోకి బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటే పిచ్చి. ఆమెను చూడడానికి ఇంటి నుంచి డబ్బులు తీసుకొని 19 ఏళ్ల వయసులో ముంబై పారిపోయాడు. ఆమెను చూసే ఛాన్స్ రాలేదు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీనితో అక్కడే ఎదో పని చేసి డబ్బులు సంపాదించుకొని అక్కడి నుంచి గోవాకి వెళ్ళాడు.
అక్కడ టాటూలు వేయడం నేర్చుకొని హైదరాబాద్ వచ్చి అదే బిజినెస్ గా పెట్టుకున్నాడు. లోబో తన మొదటి టాటూని ఓ రష్యన్ యువతికి వేశాడు. ఆ అమ్మాయే మన మహమ్మద్ ఖయ్యూంకి లోబో అని పేరు పెట్టింది. పేరు కూడా గమ్మతిగా ఉండడంతో అదే పేరును ఉంచుకున్నాడు.
లోబో అరిష కమల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇషార్త్ ఫాతిమా అనే కూతురు కూడా ఉంది. పక్కా హైదరాబాదీ యాస్ లో మాట్లాడే లోబో అలా యాంకర్ గా మారాడు. యాంకర్ గా సక్సెస్ కావడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా సెలబ్రిటీ అయ్యాడు.
వాస్తవానికి లోబోకి గత సీజన్ లోనే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. కానీ.. ఈ విషయాన్ని లీక్ చేయడంతో అతన్ని యాజమాన్యం పక్కనపెట్టింది. ఇప్పుడు ఈ సీజన్ లో ఛాన్స్ వచ్చింది. మరి మనోడు ఎన్ని రోజులు హౌజ్ లో ఉంటాడో చూడాలి.
Read Also :
- Eatela rajender : రందిపడకు రాజేందరన్న… మల్ల కోళ్ల ఫారమే దిక్కైతదా అన్న..!
- Weather forecast : ఇంట్లకెళ్లి బయటకు ఎల్లకున్రి.. మీకే మంచిది..!
- Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
- Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ లోకి బూతుల బ్యూటీ.. ఇక రోజు బీప్ వేసుకోవాల్సిందే..!
- Rashi Singh : తడిసిన బట్టలతో మెరిసిన అందాలు.. !
- Naina Ganguly ని ఇలా చూస్తే ఖతమే..!
- అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?
- Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!