Ashika Ranganath : ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ అంటూ మొత్తం వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి అమిగోస్ మూవీపై మేకర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించిన అషికా రంగనాథ్(Ashika Ranganath) కి ఒక్క వీడియో సాంగ్ తోనే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆమె అందానికి కుర్రకారు ఫ్లాట్ అయిపోయారు. ఇంతకీ ఎవరీ అషిక రంగనాథ్ అని సెర్చ్ కూడా మొదలు పెట్టేశారు.
రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు 1996లో కర్ణాటకలో అషికా జన్మించింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా హీరోయినే. 2014 మిస్ ఫ్రెస్ ఫేస్ బెంగళూరుగా ఎంపికైన అషికా ఆ తరవాత మోడలింగ్ చేసి హీరోయిన్ గా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్ ఆమెకు మొదటి సినిమా. అయితే ఆషికా సంతకం చేసిన తొలి సినిమా రాజు కన్నడ మీడియమ్. ఇందులో ఆమె తొమ్మిదో తరగతి చదివే అమ్మాయిగా కనిపించారు. ఇది ఆమె నాలుగో సినిమాగా రిలీజైంది. ఇక అమిగోస్ కంటే ముందే ఆషికా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన జేమ్స్ మూవీలో ఆషికా అతిథి పాత్రలో మెరిసింది.
ఆషికా కన్నడ అమ్మాయి అయినప్పటికి తెలుగు సినిమాలు చూడటం ఆమెకు బాగా అలవాటేనట. హీరో సిద్ధార్థ్ అంటే క్రష్ అని పలు సందర్భాలలో చెప్పింది. ఇప్పుడు ఏకంగా అతనితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే కన్నడ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి,పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో టాప్ హీరోయిన్లు ఎదిగారు. మరి ఈ లిస్ట్ లో అషికా ఉంటుందో లేదో చూడాలి.
Also Read :