Lata Mangeshkar : నెహ్రూ చేత కన్నీళ్లు పెట్టించిన లతా మంగేష్కర్ పాట..!
Cinema Latest

Lata Mangeshkar : నెహ్రూ చేత కన్నీళ్లు పెట్టించిన లతా మంగేష్కర్ పాట..!

Lata Mangeshkar : లతా మంగేష్కర్ పాటకి మంత్రముగ్ధులు కానీ వారంటూ ఉండరు.. ఆమె(Lata Mangeshkar) పాటకి దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఓ సందర్భంలో ఏడ్చారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

జవహర్ లాల్ నెహ్రూ ఓ విషయాన్ని గొప్పగా చెప్పుకునేవారట.. ఆయన ఎప్పుడూ బహిరంగంగా కన్నీళ్లు పెట్టరట.. అలా ఏడ్చేవారిని కూడా ఇష్టపడేవారు కాదట… కానీ ఓ సందర్భంలో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు.

అది 1962.. చైనాతో యుద్ధంలో భారత్ ఓడింది. ఆ యుద్ధంలో మరణించిన భారత ఆర్మీ సైనికుల గౌరవార్థం కోసం “యే మేరే వతన్‌ కే లోగోం” అనే పాటను కవి ప్రదీప్ రాశారు. ఈ పాటను జనవరి 27, 1963న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో లతా మంగేష్కర్ పాడారు.

ఆమె పాడిన ఆ పాటకి నెహ్రూ తన కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. ఈ అమ్మాయి నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించిందని ఆమెను హత్తుకున్నారట. ఆ తరవాత ఆ పాట మాస్టర్ టేపును వివిధ భారతి స్టేషన్ చేర్చారు.

రికార్డు సమయంలో హెచ్ఎంవీ దానిని రికార్డుగా మార్చి మార్కెట్లోకి తెచ్చింది. దీనితో ఈ పాట పాపులర్ అయింది. ఇదే పాటను లతాజీ నెహ్రూ కోసం 1964లో మరోసారి పాడారు. ఈ పాటను సి రామచంద్ర స్వరపరచగా లతా మంగేష్కర్ ఆలపించారు.

Also Read :