preetham jukalker  :  శ్రీకాళహస్తిలో సమంత పక్కన.. ఆమెకి ప్రీతమ్ జుకల్కర్‌‌తో ఉన్న రిలేషన్ ఏంటి?
Cinema Latest

preetham jukalker  : శ్రీకాళహస్తిలో సమంత పక్కన.. ఆమెకి ప్రీతమ్ జుకల్కర్‌‌తో ఉన్న రిలేషన్ ఏంటి?

preetham jukalker  : చైసామ్ ల బ్రేకప్ అభిమానులనే కాకుండా చాలామందిని షాక్ కి గురిచేసింది. చూడచక్కని ఈ జంట విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణాలు ఏంటో చెప్పకుండానే సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నాం అంటూ ప్రకటించారు ఈ ఇద్దరూ.. ఈ క్రమంలో వీరి బ్రేకప్ అనేక కారణాలంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రీతమ్ జుకల్కర్(preetham jukalker) పేరు బయటకు వచ్చింది.

ప్రీతమ్ జుకల్కర్ వల్లే చైసామ్ విడిపోయరంటూ నెటిజన్లు అతన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్‌ను తట్టుకోలేని జుకల్కర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్‌ను డిజేబుల్ చేసాడు. అయినప్పటికీ ట్రోలింగ్ మాత్రం తగ్గడం లేదు.. అసలు సమంత, జుకల్కర్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రీతమ్ జుకల్కర్.. ఓ ఫ్యాషన్ డిజైనర్.. చాలా మంది మోడల్స్, హీరోయిన్ కి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాడు.

అందులో సమంత ఒకరు. ఈ క్రమంలో సమంత స్టైలిష్ట్  గా పాపులర్ అయ్యాడు. దీనితో ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఓ ఎనిమిది నెలల క్రితం… ప్రీతమ్‌ జుకల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి ఒళ్లో కాళ్లు పెట్టి పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. ఆ ఫోటోకి నాలుగేళ్ళ బంధం అంటూ రాసుకొచ్చింది. దీనికి ప్రీతమ్ ఐ లవ్ యూ జీజీ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనితో వీరిద్దరి మధ్య ఎదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.

దీనితో అక్కినేని కోడలైన సమంతని వీపరితంగా ట్రోల్ చేయడంతో ఆ ఫోటోను వెంటనే డిలిట్ చేసింది సమంత. ఇప్పుడు చైసామ్ విడిపోవడంతో జుకల్కర్ ఇన్ స్టా గ్రామ్ లో చేసిన కొన్ని పోస్ట్ లు దుమారాన్ని లేపాయి. అబద్దాలు.. బంధాలను, రహస్యాలను చంపేస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉన్న ఎదో రోజు దొరికిపోతావ్ అంటూ పోస్ట్ చేశాడు. ప్రీతమ్ జుకల్కర్… సమంతకి స్టైలిస్ట్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా.. ఆమె ఎదుగుదలలో అతని పాత్ర కూడా ఉంది. ఆ మధ్య శ్రీకాళహస్తిలో సమంత పూజలు చేసినప్పుడు వెంట ప్రీతమ్ కూడా ఉన్నాడు. దీనితో ఇద్దరి మధ్య ఎదో ఉన్న వార్తలకి మరింత బలం చేకూరింది.

వీరి బంధాన్ని తప్పుగా భావిస్తున్నారని కొందరి అభిప్రాయం.. ప్రీతమ్‌ .. సామ్ ని జీజీ అని పిలుస్తాడు.. జీజీ అంటే హిందీలో అక్క అనే అర్ధం వస్తుంది. ఈ అర్ధం తెలియక చాలా మంది అతన్ని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. చైతూతో బ్రేకప్ పైన క్లారిటీ ఇచ్చిన సమంత.. ప్రీతమ్‌ విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని, దీనివలన ఈ చర్చకి పులిస్టాప్ పెట్టినట్టు అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read :