Sravanthi : పాపం.. హాట్ బ్యూటీ స్రవంతికి ఏమైంది..?
Cinema Latest

Sravanthi : పాపం.. హాట్ బ్యూటీ స్రవంతికి ఏమైంది..?

Sravanthi : కొన్ని రోజుల క్రితం నేను పేస్ చేసిన పరిస్థితి, అనుకోకుండా నా (Sravanthi) హెల్త్ చాలా బాలేకుండా అయ్యింది.కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్,నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది,ఆ సిట్యుయేషన్ లో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.

బెస్ట్ అఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం ఆడిషన్ ఉంది రావాలి అని,వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు,నా ముందు రెండే ఎంపికలు ఆరోజు,”Take the risk or lose the chance”ఇంట్లో వాళ్ళు అందరూ ఈ పరిస్థితి లో ఎందుకు లే వద్దు అన్నారు,అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని ఆఫర్స్ ని వదిలేసుకున్నాను, ఏదైతే అది అయ్యింది అని దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి వెళ్లాను ఆడిషన్ కి..

అక్కడికి వెళ్ళాక చూస్తే నాతో పాటూ ఓ ఆరుగురు గురు అమ్మాయిలు కూడా వచ్చారు,అందరు చాలా బాగా రెడీ అయ్యారు.ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు, ఇంక నేను అనవసరంగా వచ్చాను, నేను కనీసం స్ట్రాంగ్గా నిలబడలేని పరిస్థితి అని నా మనసులో అనుకొని వెళ్లి నిలుచున్నాను. ఓ సాంగ్ ప్లే చేశారు ఏదో రెండు స్టెప్స్ వేసా మెల్లగా, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సక్సెస్ఫుల్గా చెప్పేశాను.

అసలా రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు, నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలు పెట్టింది, మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ అంది. ఏం కాదులే అమ్మాయి అంతా మంచే జరుగుతుంది లే అన్నాను. మొత్తానికి అయ్యాక ఇంటికి వచ్చేసాం, ఇంక నాకు రాదు లే అని ఫిక్స్ అయిపోయి ఆ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండిపోయాను.

సడన్గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు, ఒకసారి ఆఫీస్కి రండి సార్ మీతో మాట్లాడతారట అని, ఫైనల్ గా మీటింగ్ కి వెళ్లాను మాట్లాడాను చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు, మీకు ఈ షో చేయటం ఇష్టమేనా అని అడిగారు. ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు, కానీ నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్ .. మొత్తానికి నేను “take a risk once in a life ,never giveup”అన్నది నమ్మాను.!

Also Read :