Ramesh Babu : రమేష్ బాబు ఎంట్రీనే బీభత్సం.. ఎన్టీఆర్‌‌తో ఢీ అంటే ఢీ అన్న కృష్ణ… తగ్గేదేలే…!
Cinema Latest

Ramesh Babu : రమేష్ బాబు ఎంట్రీనే బీభత్సం.. ఎన్టీఆర్‌‌తో ఢీ అంటే ఢీ అన్న కృష్ణ… తగ్గేదేలే…!

Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా టాలీవుడ్ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు.. 1987లో సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, రామానాయుడు కొడుకు వెంకటేష్, సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీకి వరుసగా ఎంట్రీలు ఇవ్వడంతో రమేష్ బాబు(Ramesh Babu ) ఎంట్రీ ఆసక్తిని సంతరించుకుంది.

సామ్రాట్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హీరో కృష్ణ.. ఈ సినిమా మొదలైనప్పుడు సీనియర్ ఎన్టీఆర్Samrat, కృష్ణ మధ్య మాటలు లేవు. దీనితో మూవీ లాంఛింగ్‌‌కి ఎన్టీఆర్‌‌ని కాకుండా అక్కినేనిని ఆహ్వానించారు కృష్ణ.. ఈ సినిమాని పద్మాలయ స్టూడియో పైనే తెరకెక్కించారు. ముందుగా కన్నడ దర్శకుడితో ఈ సినిమాను చేయించాలని అనుకున్నారు కృష్ణ.

కానీ ఆ తర్వాత వి.మధుసూదనరావు లైన్‌‌లోకి వచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌‌ను హీరోయిన్‌‌గా తీసుకున్నారు. శారద ఓ కీలక పాత్రలో మెరిశారు. బప్పిలహరి మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమా తెరకెక్కుతున్నప్పుడే బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా సామ్రాట్ అనే పేరుతోనే షూటింగ్ జరుపుకుంది.

రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండడంతో రెండు సినిమాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ టైటిల్ వివాదంలో ఎన్టీఆర్, కృష్ణ ఎవరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు. దీనితో సినీ పెద్దలు ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అయితే మొదటగా టైటిల్ హక్కులు హీరో కృష్ణ చేతిలోనే ఉండడంతో బాలకృష్ణ మూవీ నిర్మాతలు టైటిల్ విషయంలో వెనక్కి తగ్గారు. ఈ సినిమాని సాహస సామ్రాట్ పేరుతో విడుదల చేశారు. చివరికి రమేష్ బాబు సామ్రాట్ హిట్ అవ్వగా, బాలకృష్ణ సాహస సామ్రాట్ పరాజయం పాలైంది.

Also Read :