Allu Arjun : అల్లు అర్జున్..  నీకు గాయింత సోయి లేకపోతే ఎట్లా ?
Cinema Latest

Allu Arjun : అల్లు అర్జున్.. నీకు గాయింత సోయి లేకపోతే ఎట్లా ?

 

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌‌కు షాకిచ్చారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. తాజాగా బన్నీ చేసిన ఓ ప్రకటన పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీయస్ఆర్టీసీ సంస్థ నోటిసులు జారీ చేసింది. అల్లు అర్జున్‌తో(Allu Arjun) పాటు ర్యాపిడో సంస్థకు కూడా నోటీసులు పంపింది. ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందో ఒక్కముక్కలో చెప్పాలంటే … ర్యాపిడోని లేపుతూ ఆర్టీసీ కించపరిచారు. ప్రకటన సంస్థని కించపరిచేలాగా ఉందని ఆర్టీసీ అల్లు అర్జున్‌‌కు, సంస్థకి లీగల్‌‌గా నోటిసులు ఇచ్చింది.

ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు(అల్లు అర్జున్) ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటన పైన ఆర్టీసీ ప్రయాణికులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు రావడంతో ఆర్టీసీ లీగల్‌‌గా వెళ్ళింది.

ఇది పక్కనబడితే.. అల్లు అర్జున్ ఓ స్టార్ హీరో.. ఓ సినిమా చేసేటప్పుడు కథని పక్కాగా చూసుకున్నాకే షూట్‌‌‌కి వెళ్తాడు. మరి ప్రకటన చేసేటప్పుడు స్క్రిప్ట్ కూడా చూసుకోవాలి కదా.. ప్రకటన ఉద్దేశం ఏంటి? ఇది దేనినైనా కించపరిచేలా ఉందా లేదా అని చూసుకోవాల్సిన అక్కర్లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు..టైం ఉంది.. ఫేమ్ ఉంది కదా అని చేస్తే ఇలాగే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

సరే ఇదేదో మామలు ప్రకటన అంటే ఏదో అనుకోవచ్చు.. డైరెక్ట్‌‌గా గవర్నమెంట్‌‌నే ఎటాక్ చేసేది. మళ్ళీ అందులోనూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ పైన.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుక్కోచ్చేందుకు ఎండీ సజ్జానర్ ఓ పక్కా ప్రణాళికలు చేస్తుంటే మీరు ఎంచక్కా ఏసీ రూముల్లో కూర్చొని సంస్థని కించపరిచేలా ప్రకటనలు చేయడం ఏంటని నెటిజన్లు గరంగరం అవుతున్నారు. చేసేముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి కదా గాయింత సోయి లేకపోతే ఎట్లా బన్నీ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also REad :