RJ Kajal : ఇజ్జత్ పికింది.. యాంకరింగ్ రాదు.. మళ్ళీ కవరింగ్ ఒకటి..!
Cinema Latest

RJ Kajal : ఇజ్జత్ పికింది.. యాంకరింగ్ రాదు.. మళ్ళీ కవరింగ్ ఒకటి..!

RJ Kajal :  తెలుగు బిగ్‌‌బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ విజే సన్నీ మెయిన్ లీడ్‌‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సకలగుణాభిరామ’ .. ఇటీవల సినిమాకి సంబంధించిన  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్‌‌బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్(RJ Kajal) యాంకరింగ్ చేసింది. చిత్రయూనిట్‌‌కి అల్ ది బెస్ట్ చెప్పేందుకు బిగ్‌‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అందరూ, గత సీజన్స్ బిగ్‌‌బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది హాజరయ్యారు.

వీరికి తోడుగా హీరోలు విశ్వక్ సేన్, వరుణ్ సందేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు విచ్చేశారు. ఇక హీరో వరుణ్ సందేశ్ స్టేజీ పైన మాట్లాడుతూ.. సన్నీ తనకు చాలా సంవత్సరాల నుంచి తెలుసని, అతనితో అనుబంధం గురించి చెప్పాడు. బిగ్‌బాస్‌తో సన్నీ అందరి మనసులు గెలుచుకున్నాడని చెప్పి సకల గుణాభిరామ సినిమా టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

అయిపోయిన తర్వాత ఆర్జే కాజల్ మాట్లాడుతూ.. వరుణ్.. నీ ఇందువదన సినిమాకి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. దీనిపైన వరుణ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ఆల్రెడీ ఆ సినిమా రిలీజై చాలా రోజులైందని అన్నాడు. హో అయితే కంగ్రాట్యులేషన్స్ అని చెప్పాలి కదా అని కవరింగ్ చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌‌గా మారింది. దీనితో నెటిజన్లు కాజల్‌‌ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇజ్జత్ పోయింది.. సినిమా గురించి ఇన్ఫో తెలియదు.. మళ్ళీ కవరింగ్ ఒకటి అంటూ కామెంట్స్‌‌తో ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read :