Chalapathi Rao : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(Chalapathi Rao) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతన్న ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1200 పైగా చిత్రాలలో నటించిన చలపతిరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు.
‘గూడచారి 116’ సినిమాతో సినిమాల్లోకి ఏంట్రీ ఇచ్చిన చలపతిరావు… కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు తదితర సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. చలపతిరావు మృతిపట్ల సీనీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read :