Naresh : మూడు పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటే.. !
Cinema Latest

Naresh : మూడు పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటే.. !

Naresh : న్యూ ఇయర్ బాంబ్ పేల్చాడు నటడు నరేష్… నాలుగో పెళ్లికి రెడీకి అయిపోయాడు. ఇప్పటికే ముగ్గురుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నరేష్.. నటి పవిత్ర లోకేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఓ స్పెషల్ వీడియో … ఓ లిప్ కిస్ తో రచ్చ లేపిన నరేష్(Naresh) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఈ క్రమంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

నరేష్ ముందుగా సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఆతనే నవీన్.. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను నరేష్ రెండో పెళ్లి చేసున్నారు. వీరికి ఓ కొడుకున్నాడు. ఈమెకు కూడా విడాకులు ఇచ్చాడు నరేష్. వీరికి కూడా ఓ కొడుకు ఉన్నాడు.

ఇక ఆ తరువాత ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని నరేష్ పెళ్లి చేసుకున్నారు. వీరి బంధం కొన్ని రోజులు బాగానే సాగింది. వీరిమధ్య కూడా బేధాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు కూడా ఓ కుమారుడు ఉన్నాడు.

గతకొంతకాలంగా నటి పవిత్ర లోకేష్‌ తో సహజీవనం చేస్తున్న 62 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు.

Image

Also Read :