టాలీవుడ్ నటుడు కృష్ణుడు అరెస్ట్..!
Cinema Latest

టాలీవుడ్ నటుడు కృష్ణుడు అరెస్ట్..!

టాలీవుడ్ కమెడియన్ కం హీరో కృష్ణుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట కేసులో ఆయన అరెస్టు చేసినట్లుగా సమాచారం. కృష్ణుడు తో పాటుగా మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్ విల్లా లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడుని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం వీరిని అరెస్టు చేశారు. విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించి నటుడిగా కృష్ణుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అయిన వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు.

Also Read :