Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘రాధేశ్యామ్’ (Radhe Shyam)ఈ రోజు థియేటర్లోకి వచ్చింది.. పీరియాడికల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి రాధాకృష్ణ కే దర్శకత్వం వహించారు.
యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా, ప్రేరణ అనే రోల్లో పూజా హెగ్డే మెరిసింది. అయితే ఫస్ట్ డే సినిమాకి మిక్సుడ్ టాక్ వచ్చింది. సినిమాలో ఎమోషన్స్ లేవని, నేరేషన్ బాగా స్లోగా ఉందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దీనిపైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ మీమ్‌తో రియాక్ట్ అయ్యాడు. ” ‘సినిమా ఎలా ఉంది?’ అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!.. లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ నైట్, సెకండాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి?'” అనే మీమ్‌ని షేర్ చేశాడు తమన్.. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు.
#BlockBusterRadheShyam 💥💥💥💥💥💥
Slowwwww antaaaaa … Nuvvvvuuu parrigethaaaalsindhiiiii 🤣🤣🤣🤣
Adhirindhiiiii memmeee !! 🍭🍭🍭🍭🎭🤪 pic.twitter.com/SGW10l5w5h
— thaman S (@MusicThaman) March 11, 2022
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని షేర్ చేస్తూ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా తమన్ ఈ సినిమాకి నేపధ్య సంగీతం అందించాడు.
Also Read :
- Archana Gautam : బికినీ వేస్తే వావ్ అన్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఛీ పో అన్నారు
- Varalaxmi Sarathkumar : బికినీ వేసిన జయమ్మ.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ..!
- Aam Aadmi Party : తోపు, తురుమ్ అంతే.. సీఎంనే ఓడించిన మొబైల్ మెకానిక్..!