Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం…’రాజబాబు’ ఇక లేరు..!
Cinema Latest

Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం…’రాజబాబు’ ఇక లేరు..!

Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(Rajababu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

రాజబాబు స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని నరసరావుపెట.. ఆయన చిన్నప్పటి నుంచి రంగస్థలం పైన నాటకాలు వేస్తుండేవారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ ఉరికి మొనగాడు’ ఆయన మొదటి చిత్రం.. ఆ తర్వాత ‘సింధూరం’, ‘సముద్రం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘మురారీ’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కళ్యాణ వైభోగం’, ‘మళ్ళీ రావా?’, ‘బ్రహ్మోత్సవం’, ‘భరత్ అనే నేను’ మొదలగు చిత్రాలలో నటించి మెప్పించారు.

దాదపుగా 65చిత్రాలలో నటించారు రాజబాబు.. సినిమాలతో పాటుగా సీరియల్స్ లో కూడా నటించారు రాజబాబు. ముఖ్యంగా ఆయన నటించిన 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకుగానూ నంది అవార్డు లభించింది. బయటకు ఎంతో గంభీరంగా కనిపించే ఆయన చాలా సరదా మనిషి.

Also Read :