Gunasekhar : పాపం అప్పుడెప్పుడో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar ) కాస్త ఆగ్రహంతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మాట్లాడిన మాటలకు ఇప్పుడు టీడీపీ అభిమానులు ఆయన సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రుద్రమదేవి సినిమా టైమ్ లోకి వెళ్లాలి.
అనుష్క మొయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి చిత్రం పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వలేదని, బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారని, ఎందుకిలా చేశారంటూ గుణశేఖర్ కాస్త ఘాటుగా అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
అప్పుడెప్పుడో గుణశేఖర్ రాసిన ఈ బహిరంగలేఖను టీడీపీ అభిమానులు ఇప్పుడు వెలికితీశారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. గుణశేఖర్ డైరక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా అలా ప్లాప్ అయిందో లేదో టీడీపీ అభిమానులు గుణశేఖర్ రాసిన ఈ బహిరంగలేఖను బయటకు తీసి సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.
“ప్రశ్నించడం తప్పా” అంటూ అప్పట్లో గుణశేఖర్ లేఖ విడుదల చేస్తే.. “నువ్వు ఇప్పుడు సినిమాలు తీయడమే తప్పు” అంటూ టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. రుద్రమదేవి తీసి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించిన గుణశేఖర్, ఇప్పుడు శాకుంతలం సినిమాకు కూడా అవార్డ్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పాపం ఇలా జరుగుతుందని గుణశేఖర్ కూడా ఊహించి ఉండరు.. ఒకవేశ ఊహించి ఉంటే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ను డిలీట్ చేసి ఉండేవారు.
Karma is Gunashekhar!! @Gunasekhar1#Shakuntalam 😂 pic.twitter.com/LZez3fl0Hm
— Jay ✨ (@NTR_NBK_CULT) April 14, 2023
ప్రశ్నించడం తప్పా..? Is it Wrong to Question ? pic.twitter.com/SBdbz7y0CO
— Gunasekhar (@Gunasekhar1) November 15, 2017
Also Read :