Balakrishna : హోస్ట్‌‌గా బాలయ్య కుమ్మేశాడు.. అరవిందూ నీ ఐడియా అదుర్స్..!
Cinema Latest

Balakrishna : హోస్ట్‌‌గా బాలయ్య కుమ్మేశాడు.. అరవిందూ నీ ఐడియా అదుర్స్..!

Balakrishna : బాలయ్య అంటే ఓ హీరో.. ఏడాదికి ఓ రెండు సినిమాలతో తన అభిమానులను అలరించడం, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చేయడం.. ఇప్పటివరకు ఇవే బాలయ్యలో(Balakrishna ) మనం చూసినవి.. ఓ కమర్షియల్ యాడ్ కానీ ఓ షోకి హోస్ట్‌‌గా ఆయన ఇంతవరకు చేయలేదు. కారణాలు ఏవైనా కావొచ్చు అనవసరం.

కానీ ఇప్పుడు హోస్ట్‌‌గా ‘అన్‌‌స్టాపబుల్ యన్.బి.కె.’ అంటూ దీపావళి రోజున డిజిటల్ మీడియా తెర‌పైకి వ‌చ్చారు. బాలయ్య హోస్ట్ అన్నప్పుడే అందరు షాక్ అయ్యారు. బాలయ్య ఏంటి హోస్ట్ ఏంటి అనుకున్నారంతా… ఆ తర్వాత ప్రోమో రాగానే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేక పుట్టించాడు బాలయ్య.. ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ వస్తుందా అని అందర్నీ వెయిట్ చేయించేలా చేశాడు.

Image

ఫస్ట్ ఎపిసోడ్ లోనే కుమ్మేశాడు బాలయ్య.. హోస్ట్‌‌‌‌‌‌‌గా అదరగొట్టేశాడు.. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. బాలయ్యే ఏకపాత్రాభినయం చేస్తూ తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం బాగుంది. బాలయ్య ప్రెజెంటేషన్ చాలా ఫ్రెష్‌‌గా, రాయల్‌‌గా అనిపించింది. బాలయ్య డ్రెస్, స్టైల్ షోకి అడిషినల్ డోస్.

బాలయ్య హోస్ట్ ఏంటి అన్న వాళ్ళతోనే బాలయ్యే బెస్ట్ అనిపించేశాడు.. ఎపిసోడ్ అయ్యేవరకు ఎక్కడ కూడా బాలయ్యలో ఆ ఎనర్జీ తగ్గలేదు.. సరదాగా కానిచ్చేశాడు. ఇప్పటివరకు అందరు బాలయ్యని చూసింది ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అని చెప్పడంలో నో డౌట్. అటు బాలయ్యకు, ఇటు ఆహకు ‘అన్‌‌స్టాపబుల్ యన్.బి.కె.’ ఓ సూపర్ హిట్.

Image

ఇంటర్వ్యూలో కూడా మోహన్ బాబుతో కూడా ఎక్కడ కూడా సోల్లు పెట్టలేదు.. డైరెక్ట్ గా పాయింటకే దిగాడు.. చిరంజీవి పై నిజంగా నీకున్న అభిప్రాయమేమిటి సోదరా అంటూ పర్సనల్‌‌గా ఎటాక్ చేశాడు.. ముందుగా షాకైన మోహన్ బాబు ఆ తర్వాత మొత్తానికి ఏదోటి చెప్పేశాడు.

ఆ తర్వాత ఇంకాస్త డోస్ పెంచి నైట్ ఏడు తర్వాత సంగతి ఏంటి అని అడిగేశాడు. మోహన్ బాబు ఓ ‘రాయల్ సెల్యూట్’ స్టోరీ ఒకటి చెప్పేశాడు. మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ లోనే బాలయ్య సూపర్ సక్సెస్ అంతే… బాలయ్య ఇలాగే మిగతా ఎపిసోడ్‌‌లో కూడా అనిపించింది, అనుకున్నది చేసేయ్.. ఎవడాపుతాడో చూద్దాం..!

Also Read :