Manchu Vishnu : లాస్ట్ టైం మోసగాళ్ళు అంటూ ఓ పాన్ ఇండియా మూవీతో వచ్చి బొక్కా బోర్ల పడ్డ మా ప్రెసిడెంట్ విష్ణు(Manchu Vishnu ) ఇటీవలే తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే రోల్ ప్లే చేస్తున్నాడు విష్ణు.
టాప్ రైటర్ కోన వెంకట్ కథ, కథనం అందిస్తున్నాడు. గ్యాంగ్స్టర్ గంగరాజు ఫేమ్ ఇషాన్ సూర్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, AVA ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాలో విష్ణు సరసన టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇందులో స్వాతి అనే రోల్ ప్లే చేస్తోంది. రొమాంటిక్ మరియు కామెడీ ఎంటర్టైనర్గా రూపొండుతున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఈ సినిమాలో నటిస్తోంది. రేణుక అనే పాత్రలో ఆమె కనిపించబోతుంది.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో అమెది మెయిన్ రోల్ అని తెలుస్తోంది. టాలీవుడ్లో సన్నీలియోన్ చివరిసారిగా 2019లో డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో నటించింది.
Also Read :
- Ladies married : ఇద్దరమ్మాయిల పెళ్లి.. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్..!
- Anasuya Bharadwaj : హాట్ హాట్ గా అనసూయ..!