Sivasankar : శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం…. 75% ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్..!
Cinema Latest

Sivasankar : శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం…. 75% ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్..!

Sivasankar : సినీ కోరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది.. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్(Sivasankar ) గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటుగా ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు.

దాదాపుగా 75% ఆయన ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ సోకినట్టుగా తెలుస్తోంది. అటు ఆయన పెద్ద కుమారుడికి కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా డాక్టర్లు వెల్లడించారు.

ఇక ఆసుపత్రి ఖర్చులు కూడా బాగా అయ్యాయని దాతులు ఎవరైనా ముందుకు సహాయం చేయాలనీ ఆయన చిన్న కుమారుడు అజయ్ కోరుతున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

 

శివ శంకర్ తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ సినిమాలు చేశారు. పలు సినిమాలలో నటించి నటుడిగా కూడా రాణించారు.

Also Read :