Balayya : పుట్టినరోజు నాడే చనిపోయిండు.. ‘బాలయ్య’ ఇక లేరు..!
Cinema Latest

Balayya : పుట్టినరోజు నాడే చనిపోయిండు.. ‘బాలయ్య’ ఇక లేరు..!

Balayya : టాలీవుడ్‌‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు బాలయ్య(Balayya) కన్నుమూశారు.. ఇదే రోజు ఆయ‌న పుట్టిన‌రోజు కూడా. ఆయన అసలు పేరు మన్నవ బాలయ్య.. ప్రస్తుతం ఆయన వయసు 94సంవత్సరాలు..హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ఆయన తుదిశ్వాస విడిచారు.

తెలుగులో 350 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన.. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా మెప్పించారు. గుంటూరు జిల్లాలో చెందిన బాలయ్య.. మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు.. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు.

1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించారు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చి చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తూ వచ్చారు.

2000 సంవత్సరములో తీసిన “పల్లెవాసం-పట్నవాసం”కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుంచి ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. మన్మధుడు, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం, అన్నమయ్య, పెళ్ళి సందడి చిత్రాలు ఆయనకీ మంచి పేరును తీసుకొచ్చాయి..!

Also Read :