Sarkaru Vaari Paata Review : మూవీ లవర్స్ లో మహేష్ బాబు ఫీవర్ కనిపిస్తోంది. సర్కారు వారి పాటతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబు, క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ కలిసి నటించారు.
కళావతి సాంగ్ తో యూ ట్యూబ్ ను షేక్ చేసిన సర్కారువారి పాటపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే సూపర్.. బంపర్ హిట్ అని రిలీజ్ కు ముందే సంబరాలు చేసుకున్నారు.
ఇక సినిమా విషయానికి వద్దాం.
సర్కారు వారి పాటకు(Sarkaru Vaari Paata )పబ్లిక్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. బొమ్మ అదుర్స్ అని మహేష్ ఫ్యాన్స్ .. థియేటర్ల దగ్గర చిందులేస్తున్నారు. ఈ సమ్మర్ కి ప్రిన్స్ పిచ్చెంకించాడని అంటున్నారు. తమ హీరోకు సాటిలేరని సినిమాకు 5/5 రేటింగ్ ఇవ్వాల్సిందేనంటున్నారు
అయితే.. జనరల్ పబ్లిక్ మాత్రం సినిమా విషయం చాలా డిసప్పాయింట్ అయ్యామని చెబుతున్నారు. సర్కారు వారి పాట.. ఈ సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉందని.. కానీ సెకండాఫ్ చాలా డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు. సెకండాఫ్ ను కావాలనే సాగదీసినట్టుగా ఉందని చెబుతున్నారు. చాలా సీన్లు లాగ్ ఉన్నాయంటున్నారు.
ఇక.. రెగ్యులర్ కమర్షియల్ కంటెంట్ తప్ప మూవీలో(Sarkaru Vaari Paata )కొత్తగా ఏం లేదంటున్నారు మరికొందరు. ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నా.. సెకండాఫ్ ను మరింత బాగా ప్లాన్ చేస్తే బాగుండేదంటున్నారు.
బబ్లీ గాళ్ గా నుంచి జీరో సైజ్ తో క్యూట్ గా మారిన కీర్తి సురేష్ ను చూసేందుకు చాలా ఆసక్తి చూపించారు. కళావతి పాటలో కీర్తిని చూసి ఫిదా అయిన ఫ్యాన్స్.. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కీర్తి నటన ఊహించిన స్థాయిలో లేదని అసంతృప్తిగా చెబుతున్నారు. గ్లామర్ షో విషయంలో కీర్తి మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయినా ఫ్యాన్స్ హార్ట్ అయినట్టు కనిపిస్తోంది.
సో.. ఓవరాల్ గా ఫ్యాన్స్ ఒపినియన్ ప్రకారం మూవీ బంపర్ హిట్.
కామన్ పీపుల్ ఒపినియన్ ప్రకారం యావరేజ్ హిట్.
Read Also :
- Nayanthara : జూన్ 9న నయనతార పెళ్లి..ఎక్కడంటే?
- Revanth Reddy : కేటీఆర్ సిల్లీ ట్వీట్… రేవంత్ అదిరిపోయే కౌంటర్..!
- Disha daily : ఓ దిశ.. ఎటు నీ దిశ..?
- Modi jammu : నేలరాలిన సైనికుల శవాలను లెక్కపెట్టుకుని రా..!
- Anasuya : తిట్టినోళ్లే పొగుడుతున్నరు..!