Samantha Ruth Prabhu : మూడు యూట్యూబ్ చానళ్లపై సమంత పరువు నష్టం దావా..!
Cinema Latest

Samantha Ruth Prabhu : మూడు యూట్యూబ్ చానళ్లపై సమంత పరువు నష్టం దావా..!

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై ఆమె కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. యుట్యూబ్‌ చానల్స్‌తో పాటు ఓ అడ్వకేట్‌పై కూడా సమంత(Samantha Ruth Prabhu) పిటిషన్లు దాఖలు చేశారు.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కించపరిచేలా వ్యాఖ్యలు, అభ్యంతరకర వీడియోలు చేశారని, అవి తన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె తన పిటిషన్ లలో పేర్కొన్నారు. దీనిపైన సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు.

కాగా సమంత ఇటీవల అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారో కారణం చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీంతో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన సదరు మూడు యూట్యూబ్‌ చానల్స్‌పై సమంత కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే శాకుంతలం సినిమాని ఫినిష్ చేసిన సామ్.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించింది.

Also Read :