RGV : ఇండస్ట్రీ పెద్దలను ఏకిపారేసిన వర్మ… ఉమ్మేసినంత పనిచేశాడు..!
Cinema Latest

RGV : ఇండస్ట్రీ పెద్దలను ఏకిపారేసిన వర్మ… ఉమ్మేసినంత పనిచేశాడు..!

RGV : సూటిగా సుత్తి లేకుండా చెప్పడం వర్మ స్టైల్. ఏ విషయానైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు వర్మ. అదే అందరికి నచ్చదు కాబోలు.. వర్మ(RGV) తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి పట్ల స్పందించిన వర్మ.. ఇండస్ట్రీ పెద్దలను ఏకిపారేశాడు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!. అంటూ ట్వీట్లు మొదలు పెట్టన వర్మ. వారి పై ఉమ్మేసినంత పనిచేశాడు.

కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ మరో ట్వీట్ చేశాడు.

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం’’ అన్నాడు.

Also Read :