Rao Ramesh : టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో రావు రమేష్ (Rao Ramesh) ఒకరు.. విలక్షణ నటుడు రావు గోపాల్ రావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లొనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.
ఇదిలావుండగా ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఓ సినిమాని నిర్మిస్తుంది.. పలాస సినిమా ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో రావు రమేష్ ని తీసుకున్నారట.
అయితే ఈ సినిమా కోసం రావు రమేష్ ఎక్కువ రోజులు కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో రెమ్యునరేషన్ ఏకంగా కోటిన్నర అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్ విషయంలో కోటి అడగడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read :
- తాలిబన్లకు షాక్.. మనోళ్లను తీసుకొచ్చారు.. గ్రేట్ IAF
- మీ బతుకుల మన్ను.. గాంధీ ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధులు..!
- వీళ్లు ఊరికే ఉండరు కదా.. మల్లోకరు దొరికిపోయారు..!