Ramya Raghupathi : నరేష్, పవిత్రల పెళ్లి వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi ) స్పందించారు. వారి పెళ్లి జరగనివ్వని అన్నారు. నరేష్ తనకింకా విడాకులు ఇవ్వలేదని, విడాకులకు సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుందని తెలిపారు.
నరేష్‌ను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని,ముందుగా తన ఇంట్లో ఒప్పుకోకపోతే అందర్ని ఒప్పించానని రమ్య రఘుపతి తెలిపారు. నరేష్ అమ్మగారైన విజయనిర్మల తనని మహారాణిలాగా చూసుకుందని వెల్లడించారు. అయితే పెళ్లయ్యాకే నరేష్ నిజస్వరూపం తనకు తెలిసిందని రమ్య చెప్పారు. నరేష్ కు చాలామందితో సంబంధాలున్నాయన్నారు.
సమ్మోహనం సినిమా షూటింగ్ టైమ్‌లో నరేష్,పవిత్రలకు పరిచయం ఏర్పండిందని.. ఆమెను నరేష్ ఓ సారి ఇంటికి కూడా తీసుకువచ్చాడని రమ్య తెలిపింది. మా ఎలక్షన్ టైమ్‌లో ఇద్దరకి సంబంధం ఉన్నట్లుగా తెలిసిందని, చివరికి అదే నిజం అయిందన్నారు. రిసెంట్ గా షేర్ చేసిన వీడియోను చూసి తాను చాలా బాధపడ్డానని ,చెప్పారు.
ఇదంతా చూసి తని కొడుకు కుమిలిపోతున్నాడని రమ్య తెలిపారు. నరేష్ కు విడాకులిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన రయ్య.. అతన్ని వదలనన్నారు. ఎంతకష్టమైనా తాను పోరాటం చేస్తానని వెల్లడించారు.
Also Read :