Ram Gopal Varma : మందు, అందమైన అమ్మాయి.. జీవితానికి ఈ రెండు చాలు అంటాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. ఈ రెండు ఒకేసారి వర్మకి దొరికితే ఎలా ఉంటుంది.. ఆ కిక్కు వర్మకి లేటెస్ట్గా దొరికింది.
వర్మ ఇటీవల గురువారం (ఏప్రిల్ 7)న పుట్టినరోజు జరుపుకున్నాడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పార్టీలో వర్మ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హాట్ హీరోయిన్ నైనా గంగూలీ వర్మకి బుగ్గల పైన కిస్ ఇచ్చి మరి బర్త్ డే విషెస్ చెప్పింది.
Yesterday night scenes from @RGVzoomin Sir's Birthday Bash….🎊 🎂 pic.twitter.com/DGDEmtxhlX
— Naina Ganguly (@NainaGtweets) April 8, 2022
ఈ వీడియోని స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. కాగా వర్మ తాజాగా తెరకెక్కించిన ‘డేంజరస్ (తెలుగులో మా ఇష్టం)’చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్గా నటించింది.. ఇందులో మరో హీరోయిన్గా అప్సర రాణి నటించింది.
లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు కొన్ని థియేటర్లు విముఖత వ్యక్తం చేయడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
Aslo Read :