Chaysam : కారణాలు ఏవైనా తన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్లు పెట్టుకుని దిగిన ఫోటోను కొన్నాళ్ల క్రితం సమంత(Chaysam) ఇన్స్త్రా లో పెట్టడం…అక్కినేని కుటుంబంతో పాటు ఫాన్స్ నొచ్చుకోవడంతో వివాదం ముదిరింది. ఆ తర్వాత పరిణామాలతో తారాస్థాయికి చేరుకుంది. తాజాగా విడాకులతో శుభం కార్డు పడింది.
హీరోలు ఏమైనా చేయొచ్చు… కానీ హీరోల కుటుంబాల్లోని ఆడవాళ్లు ఎక్స్ పోజింగ్ చేస్తే హీరోలతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేరు. అమల బ్లూ క్రాస్ లాగా…సమంత ఏదైనా ఎన్జీవో నూ చూసుకుంటూ అణిగిమనిగి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు.
అయినా ఈ సెలబ్రిటీలు విడిపోయినా స్నేహితులు గానే ఉంటారు. అవసరాలను బట్టి కలుసుకుంటారు. వీలైతే మళ్లీ జంటగా సినిమాలో నటిస్తారు. వాళ్ళు బానే ఉంటారు. కాకపోతే వాళ్ళ గ్యాప్ ను ఇంకొన్నాళ్లు వార్తలకు వాడుకోవాలనుకున్న మీడియాకే కొంత నిరాశ. అయినా తగ్గేది లేదు…రేపటి ఎల్లుండి వరకు మరేదైనా మసాలా వార్త దొరక్క పోతుందా..!
విడాకుల విషయం ప్రకటించిన తర్వాత ప్రీతమ్ పెట్టి…డిలీట్ చేసిన స్టేటస్..అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత..!
Manthaiah Patel Manishetti
Also Read :