Naga Babu : చిరంజీవి, పవన్ కళ్యాణ్… నాగబాబు ఖాతాలో మరొకరు బలి.. !
Cinema Off Beat

Naga Babu : చిరంజీవి, పవన్ కళ్యాణ్… నాగబాబు ఖాతాలో మరొకరు బలి.. !

Naga Babu : ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మా ఎలక్షన్ ఫలితాలు దాదాపుగా వచ్చేశాయ్. మా కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు… ప్రకాష్ రాజ్ పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. దీనితో మంచు విష్ణుకి సెలబ్రిటీలతో పాటుగా… అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన నాగబాబు(Naga Babu) ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.

ప్రకాష్ కి మద్దతు తెలిపిన నాగబాబు కొన్ని ఇంటర్వ్యూలలో రెచ్చిపోయి మాట్లాడారు.. కోట లాంటి నటుడిని, మళ్లీ అందులోనూ తనకంటే పెద్ద వ్యక్తి అని కూడా చూడకుండా ఎప్పుడు పోతాడో తెలియదు అంటూ నాగబాబు మాట్లాడడం పెద్ద చర్చకు దారితీసింది.

నాగబాబు ఇలా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతని పైన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఆయన మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబుని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. నాగబాబు పక్కన ఉంటే ఎంతటి వాడైనా భస్మమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

“నాగబాబు నిక్కర్లు వేసుకునే టైంలో కోట శ్రీనివాస రావు గారు ఒక డైలాగ్ చెప్పాడు..’ రౌడీయిజం రాజకీయం ఒకటి కాదురా రేయ్’ అని ఆ నాగబాబుకి ఈరోజు అర్థం అయ్యుంటుంది ఆ డైలాగ్ విలువ..”

  • నాగబాబు ఎవరి ప్రక్కన ఉంటే వాళ్ళ జీవితం నాశనమే…

  • “నాగబాబు” ఇప్పటికైనా
    బుద్ధి తెచ్చుకుని మీ అన్నయ్య పేరు చెడగొట్టమాకు..
  • #LoveYouMegastar🔥🔥🔥
  • నాగబాబు గారూ అతికి, అహంకారానికి పోయి పాముని పక్కన పెట్టుకుని నోటికొచ్చింది మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇకనైనా తెలుసుకుంటే మంచిది.

  • నాగబాబు నోటి దూల వల్లే ఓడిపోయిన ప్రకాష్ రాజ్, వ్యక్తిగా ప్రకాష్ రాజ్… విష్ణు కంటే ఉన్నత బావాలు కలిగిన వాడే… కానీ వెనకటికి వాజపాయ్ ని ఎరైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అనే వారు ఇప్పుడు అది ప్రకాష్ రాజ్ కి బాగా వర్తిస్తుంది.