అమ్మా మాధవిలత… సమంత ఈ విషయాలన్నీ నీకు చెవిలో చెప్పిందా… ?
Cinema Latest

అమ్మా మాధవిలత… సమంత ఈ విషయాలన్నీ నీకు చెవిలో చెప్పిందా… ?

మొన్నటివరకు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వీరి విడాకుల పైన అభిమానులు మాత్రమే కాదు .. ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే సినీ హీరోయిన్, బీజేపీ మహిళ నేత మాధవీలత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సమంతకి మద్దతు పలుకుతూ మాట్లాడింది మాధవీలత.

May be an image of 1 person

మాధవీలత ఏం మాట్లాడిందంటే…?

సమంత క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ దేవుళ్ల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తిరుమల వెళ్ళినప్పుడు కూడా తాళిబొట్టును కళ్ళకు అద్దుకుందని చెప్పుకొచ్చింది. ఇక చైసామ్ విడిపోవడానికి సమంత పొట్టిపొట్టి బట్టలు వేసుకోవడం సరైన వాదన కాదని చెప్పుకొచ్చింది. అటు గతంలో సమంతకి తల్లి కావాలనే ఇష్టం ఉండేదని కాకపోతే ఆ ఆశను కూడా చంపేసుకొని మనీ ఎర్నింగ్ మెషిన్‌లా మారిపోయిందని 100% ఇన్ఫర్మేషన్‌తో చెబుతున్నట్టుగా వెల్లడించింది మాధవీలత.

పెళ్లయినా ఒక రోబోలాగా పనిచేసి ఆమె డబ్బులు సంపాదించిందని, అలా కోట్లు సంపాదించి.. ఆ కుటుంబం నుంచి పాకెట్ మనీ తీసుకునేదని, ఇంతకన్నా దారుణం కన్నా సమంత విడిపోవడమే కరెక్ట్ అంటూ వెల్లడించింది. ఇక చీరకట్టిన ప్రతి ఒక్కరు మంచోళ్ళని, మోడ్రెన్ డ్రెస్ వేసుకున్నోళ్లంతా చెడ్డోళ్ళని కాదు.. సమంత సో గుడ్. రూపాయి కూడా బయటకు తీయలేని కుటుంబం నుంచి సమంత బయటకు వచ్చిందని చెప్పుకొచ్చింది.

అయితే ఆమె చేసిన ఈ కామెంట్స్ పైన నెటిజన్లు మండిపడుతున్నారు. అంతపెద్ద కుటుంబం సమంత తెచ్చే డబ్బులపైన బ్రతికేస్తున్నారా… ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది? పోనీ ఈ విషయాలన్నీ సమంత .. మాధవీలతకి చెవిలో చెప్పిందా ?లేకా ఈమె దగ్గరుండి చూసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా కొంచం మేకప్ తగ్గించుకోండి మేడం చూడలేకపోతున్నాం అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Also Read :

https://fb.watch/8sdXeYQlbs/