Rahul Ramakrishna : నీ అంత ఏర్రీనా కొడుకుని నేను ఇంతవరకు చూడలేదు బ్రో..!
Cinema Latest

Rahul Ramakrishna : నీ అంత ఏర్రీనా కొడుకుని నేను ఇంతవరకు చూడలేదు బ్రో..!

Rahul Ramakrishna : ఇదే చివరి సంవత్సరం.. ఇక పై సినిమాలు చేయను… ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటూ టాలీవుడ్ కమెడియన్ రాహుల్‌ రామకృష్ణ(Rahul Ramakrishna) చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన క్లారిటీ మళ్ళీ ఇచ్చాడు అతను.

“మూర్ఖులారా .. జోక్‌ చేశానంతే. భారీ రెమ్యునరేషన్‌, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్‌ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్‌ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది” అంటూ ట్వీట్ చేశాడు.. దీనితో నెటిజన్లు రాహుల్‌ రామకృష్ణ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

నీ అంత గలీజ్.. ఏర్రీనా కొడుకుని నేను ఇంతవరకు చూడలేదు బ్రో అంటూ గుస్సా అవుతుర్రు.. నువ్వు జోక్ వేసి అది నువ్వే జోక్ అని చెప్పడం కిరాక్ బ్రో.. నిజమైన కమెడియన్ అనిపించుకున్నావ్ అంటూ కామెంట్స్ వదులుతున్నారు.. జర్నలిస్ట్ ఫీల్డ్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చిన రాహుల్‌ రామకృష్ణ..అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫేం తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత గీతాగోవిందం, భరత్ అను నేను, జాతిరత్నాలు మొదలగు సినిమాలలో నటించి అనతికాలంలోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయ్యాడు… కేవలం నటుడిగానే కాకుండా గీతరచయితగా కూడా మెప్పించాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో రెండు పాటలు రాశాడు.

మల్టీ టాలెంట్ ఉన్న రాహుల్.. ఇలా జోక్స్, ఫూల్స్ అంటూ పిచ్చి వేషాలు వేయడం ఏంటో అర్ధం కావడం లేదు.

Also read :