home page

 వామ్మో రోజా నీ ఓవర్ యాక్షన్ మాకొద్దు.. మాకు ఇంద్రజే ముద్దు.. మేడం సార్ మేడం అంతే..! 

 | 
Roja

 ◆ జబర్దస్త్ లో ఇంద్రజకీ పెరిగిన భారీ డిమాండ్

◆ మళ్లీ షోలోకి వచ్చిన రోజా..

◆ ఇంద్రజను తీసుకురావాలని నెటిజన్లు మల్లెమాలకి రిక్వెస్టులు

 

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో... ఈ షోకి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. షో మొదలై తొమ్మిదేళ్లు అవుతున్న ఇప్పటికే మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రోమోస్ నుంచి స్కిట్స్ వరకు షో దుమ్ములేపుతుంది.  ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీ పరిచయమయ్యారు. అయితే ఈ కామెడీ షో సక్సెస్ లో కమెడియన్స్ కి ఎంత ప్రియరిటీ ఉందో జడ్జీలకి కూడా అంతే ఉంది.

మొదట నాగబాబు, రోజా చేశారు. నాగబాబు ఓ సంవత్సరం కింద వెళ్లిపోగా చాలా మందిని ట్రై చేసి.. చేసి చివరికి సింగర్ మనోను ఫిక్స్ చేశారు. మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి రోజా కూడా కొన్ని రోజులు షో నుంచి తప్పుకుంది.  ఆమె ప్లేస్ లో ఇంద్రజను తీసుకొచ్చారు.

అందరి జడ్జీలకి చాలా ఏళ్ళకి మంచి పేరు వేస్తే.. ఆ క్రెడిట్ ని ఇంద్రజ కొన్ని ఎపిసోడ్స్ తోనే కొట్టేసింది. చక్కగా నిండుగా చీరతో, అందమైన నవ్వుతో షోకి మోస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె స్మైల్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు.

అసలే బలవంతుడు అంటే.పైగా బూస్ట్ తాగాడు అన్నట్టుగా... ఇంద్రజ వచ్చాక షోకి ఇంకా క్రేజ్ పెరిగింది. ఆమె స్మైల్ కోసం ప్రోమోలను రీపీట్ గా చూసిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీనితో ఇంద్రజను షో లో కంటిన్యూ చేయాలన్న డిమాండ్ ఏర్పడింది. కానీ అలా కోరుకున్న ఫ్యాన్స్ కి పెద్ద షాక్ వచ్చింది. మళ్లీ రోజా తన ప్లేస్ లోకి వచ్చేసింది.

రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో ఇంద్రజ లేదు.. రోజా ఉంది. దీంతో రోజాను చూసిన జబర్దస్త్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మళ్లీ ఇంద్రజని తీసుకురావాలి అంటూ కామెంట్స్ బాక్స్ లలో డిమాండ్ మొదలు పెట్టారు.

రోజా వద్దు.. ఇంద్రజే ముద్దు అంటూ స్లొగన్స్ మొదలు పెట్టారు. ఇంకొదరైతే ముగ్గురు జడ్జీలను పెట్టండి అంటూ మల్లెమాలను  అడిగేస్తున్నారు. మొత్తం ఒక వెయ్యి కామెంట్స్ వేస్తే..అందులో 990 ఇంద్రజ మళ్లీ రావాలనే కామెంట్స్ ఉన్నాయి. సో మరి ప్రేక్షకుల డిమాండ్ ని మల్లెమాల ఏం చేస్తుందో చూడాలి.