Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్‌శివన్ – నయనతార లవ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి వివాహంపై ఓ క్లారిటీ వచ్చింది. పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
జూన్ 9వ తేదీన వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వివాహ వేదిక కోసం తిరుమల వెళ్లారు నయనతార, విఘ్నేష్. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
నయనతార తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయమైన నానుమ్ రౌడీథాన్ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
Also read :