Akhanda  : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!
Cinema Latest

Akhanda : బోయపాటి నిన్ను మించినోడు లేడుపో.. బాలయ్య అంటే ఎందుకయ్యా అంత పూనకం…!

Akhanda : ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే ఓ సెన్సేషన్.. ఇప్పటికే వీరి నుంచి వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ  కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’.(Akhanda ) కొద్దిసేపటి క్రితమే ట్రైలర్‌‌ను బయటకు వదిలారు.

కొత్తగా ఏమీ లేదు.. అలా అని అభిమానులు అంచనాలు ఎక్కడ తగ్గలేదు.. అనుకున్నదే చూపించారు. బోయపాటి మార్క్ డైలాగులు, ఫైట్లు, ఫ్రేమ్‌‌లు, ఫ్యామిలీలు, సీన్లు అంతా అవే.. బాలయ్య ఫ్యాన్స్‌‌కు ఏం కావాలో పర్ఫెక్ట్‌‌గా దించాడు బోయపాటి.. బాలయ్య డైలాగ్‌‌లకి అరుపులే.. ఫైట్‌‌ల సంగతి సరేసరి.. ట్రైలర్ తో సినిమా సక్సెస్‌‌‌ని సగం ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి.

Image

ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బాలయ్య క్యారెక్టరైజేషన్.. అదేంటో మరి బాలయ్య అనేసరికి బోయపాటికి ఎక్కడ లేని పూనకం వస్తుంది. బాలయ్య అభిమానులకి ఏం కావాలో బోయపాటికి బాగా తెలుసు.. అందులో బోయపాటి పీహెచ్ డి చేశాడు. సింహ నుంచి ఇప్పుడు అఖండ దాకా బాలయ్యకి సపరేట్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశాడు బోయపాటి.. అవే సినిమాకి ఎక్కడ లేని క్రేజ్.. సినిమా సక్సెస్‌‌కి మెయిన్ రీజన్‌‌‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బోయపాటి క్రియేట్ చేసిన ఈ సపరేట్ క్యారెక్టరైజేషన్‌‌ లన్నీ సినిమా సేకాంఫ్ హాఫ్‌‌లోనే వస్తాయి.

Image

ఈ పాత్రలు ఉన్నది కొద్దిసేపే అయిన ఫ్యాన్స్‌‌ని సీట్లో కూర్చోనివ్వవు. సింహలో డాక్టర్ నరసింహ అయితేనేం.. లెజెండ్‌‌లో జయదేవ్ అయితేనేం.. ఇప్పుడు అఘోరా పాత్ర.. క్యారెక్టరైజేషన్ తర్వాత బాలయ్య, బోయపాటి అంటే మాట్లాడుకోవాల్సింది డైలాగులే..

చూడు ఒక వైపే చూడు..మరోవైపు చూడాలని అనుకోకు.. మాడిపోతావ్..! 

నేను ఒకడికి ఎదురేల్లిన వాడికే రిస్క్.. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్.. తోక్కిపడేస్తా..! 

ఇప్పుడు..

ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. 

ఆహ.. ఇలాంటివి ఇంకో రెండు డైలాగులు సినిమాలో పడితే సినిమా బ్లాక్ బస్టరే.. !

Also Read :