Roja : సంపాదించింది మొత్తం అప్పులకే.. ఫైర్ బ్రాండ్ ఎమోషనల్..!
Cinema Latest

Roja : సంపాదించింది మొత్తం అప్పులకే.. ఫైర్ బ్రాండ్ ఎమోషనల్..!

Roja : స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది నటి రోజా(Roja ).. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలకి సరిసమానంగా డాన్స్ చేయడం ఆమె సొంతం. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతుంది. అలాగే బుల్లితెర పైన జబర్దస్త్ లాంటి షోలకి జడ్జీగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఇదిలావుండగా తాజాగా రోజా ఎమోషనల్ అయ్యారు.. వినాయక చవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రాం రాబోతోంది. ఇందులో రోజా తన లైఫ్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

“1991లో నేను ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం అప్పులే కట్టాను. ఇక పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికి నాకు అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం” అంటూ రోజా ఎమోషనల్ అయ్యారు.

Also Read :

ఎప్పుడు నవ్వుతూ కనిపించే రోజా ఇలా ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది.