MS Raju : సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అంటే ఇప్పుడో బిజినెస్మెన్. సినిమాకు ఎంత డబ్బు కావాలో పెట్టడం లాభాలు వచ్చాయో లేదో చూసుకోవడం. కానీ కొందరు మాత్రమే దీనికి భిన్నం. అందులో ఎంఎస్ రాజు(MS Raju) ఒకరు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్ అంటే అప్పట్లో ఓ బ్రాండ్ ఉండేది. ఈ బ్యానర్లో ఒక్కడు, దేవిపుత్రుడు లాంటి భారీ బడ్జెట్ మూవీలతో పాటుగా మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఫీల్ గుడ్ మూవీస్ కూడా వచ్చాయి.
ఈ బ్యానర్ ద్వారా ఎంతోమంది దర్శకులను, మ్యూజిక్ డైరక్టర్స్, యాక్టర్ లను వెండితెరకు పరిచయం చేశారు ఎంఎస్ రాజు. కథ, కథనం లాంటి వాటికి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఆయన సినిమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ రాజు సినిమా అంటే భయపడే, భూతు సినిమా అనే కాడికి వచ్చింది. అభిరుచి గల నిర్మాతగా పేరున్న ఆయన దర్శకుడిగా అవతారం ఎత్తి ఇదా.. ఎంఎస్ రాజు సినిమా ? ఏం పోయే కాలం ఇలాంటి సినిమాలు తీసి పరువు తీసుకుంటున్నాడు అని బహుశా అనుకోని సగటు సినీ అభిమాని ఉండడు కావచ్చు.
పవిత్ర, నరేష్ పెళ్లి గోల ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. వీళ్లద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అంటూ సినిమాలో కలిసి నటిస్తున్నారు. దీనికి నరేష్ స్వయంగా నిర్మిస్తుండగా ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకుడు. పవిత్ర, నరేష్ ల జీవిత కథ అధారంగానే ఈ మూవీ తెరకెక్కుతోందని టీజర్ చూసిన ఎవరికైనా అర్థం అవుతోంది. నరేష్ కంటే డబ్బులున్నాయి. ఈ సినిమా ఆడకపోయిన వచ్చే నష్టమేమి ఆయనకు లేదు. ఇక పేరా అంటరా.. కొత్తగా ఆయన పేరు చెడిపోయేది కూడా ఏం లేదు.
కానీ ఎంఎస్ రాజుకు ఏం పోయే కాలం? ఇలాంటి సినిమాలు ఎందుకు చేయడం? అప్పట్లో డర్టీ హరి అనే ఓ సినిమా తీశాడు. ఎందుకు తీశాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటూ సినిమా చేస్తు్న్నాడు. నరేష్ పెళ్లిల జీవితం తెరిచిన పుస్తకం.. ఇందులో కొత్తగా చూసేది ఏం ఉంది? కొత్తగా ఎంఎస్ రాజు ఆయనలో చూపించేది ఏం ఉంటది. ఈ సినిమా వల్ల ఎంఎస్ రాజు పేరు మరింత దిగజారడం తప్ప ఏం లేదు. ఈలాంటి చెత్త చెత్త సినిమాలు తీయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్. ఉన్న పేరును కాపాడుకోవడం మంచిది.
Also Read :