Manchu Vishnu : ‘మంచు’ కాదు కంచే.. మెగా ఫ్యామిలీ పరువు గంగపాలు..!
Cinema Latest

Manchu Vishnu : ‘మంచు’ కాదు కంచే.. మెగా ఫ్యామిలీ పరువు గంగపాలు..!

Manchu Vishnu : ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మా ఎలక్షన్ ఫలితాల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు (Manchu Vishnu ) ప్యానెల్లో పదిమంది గెలవగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎనిమిది మంది గెలిచారు.

ఎలక్షన్ ఫలితాల తర్వాత నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంచు విష్ణు.. మెగాఫ్యామిలీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కింద మంట పెడుతూనే పైన నీళ్ళు పోసినట్టుగా మంచి విష్ణు మాటలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనను కాంప్రమైజ్ కావాలని కోరినట్టుగా వెల్లడించారు. ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవం చేద్దామని తన తండ్రి మోహన్ బాబుతో కూడా చిరంజీవి మాట్లాడినట్టుగా విష్ణు వెల్లడించారు.

అయితే తన తండ్రి ఎన్నికలకు వెళ్తామని చెప్పడంతోనే తాను బరిలో నిలిచినట్టుగా విష్ణు చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ ఓటు 99% ప్రకాష్ రాజ్ కి పడిందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నానని అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది… రిజల్ట్ వచ్చేసింది.. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు?

దీనికి ముందు అంటే మా ఎలక్షన్స్ ముందు మెగాబ్రదర్ నాగబాబు పైన గౌరవం ఉంది అంటూనే నాగబాబు అసలు క్యారెక్టర్ ఇదని చెప్పకనే చెప్పేశాడు. మీకు నచ్చిన మనుషులను టార్గెట్ చేస్తూ… వారి పైన సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేయడం మీకు అలవాటేనని అన్నాడు.

అంతేకాకుండా.. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే, నాది, నా కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు మీ ఫ్యాన్స్‌కు ఇచ్చి తిట్టమని చెబుతారు. ఇది మీకు అలవాటే.. కావాలంటే మీరు మా నెంబర్లు ఇవ్వవచ్చు. గతంలో రాజశేఖర్ ఫ్యామిలీతో కూడా మీరు ఇలాగే బిహేవ్ చేశారంటూ నాగబాబుకు చురకలంటించాడు.

పెద్దరికం, గౌరవం అంటూనే మెత్తగా మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీని సన్నగా, చిన్నగా మాటలతో పొడుస్తున్నాడు విష్ణు… ఇక పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో భవిష్యత్తులో చూడాలి.

Also Read :