Mahesh Babu : ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు(Mahesh Babu ), త్రివిక్రమ్ కాంబో సెట్టయ్యింది. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2023 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కతోన్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.
మళ్లీ 12 ఏళ్ల తరువాత ఈ కాంబో రీపిట్ అవుతుండడంతో ఈ చిత్రం పైన అంచనాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి ‘అసుర సంధ్య వేళలో..’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా సమాచారం. నవీన్ నూలి ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్ గా ఎఎస్ ప్రకాష్, సినిమాటోగ్రఫర్ గా పీఎస్ వినోద్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక రాజమౌళి మూవీకి షిప్ట్ కానున్నాడు మహేష్.