Lata Mangeshkar :  లతా మంగేష్కర్ తెలుగులో పాడింది మూడు పాటలే..!
Cinema Latest

Lata Mangeshkar :  లతా మంగేష్కర్ తెలుగులో పాడింది మూడు పాటలే..!

Lata Mangeshkar : లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్ ఇక లేరు… ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఈరోజు అమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్(Lata Mangeshkar) జనవరి 11న కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకున్నారు.

ఈ క్రమంలో లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షిణించడంతో వైద్యులు మెరుగైన చికిత్సను అందించేందుకు ప్రయత్నించారు.. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించకపోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

30 భాషల్లో దాదాపుగా 30 వేల పాటలు పాడిన లతా మంగేష్కర్ తెలుగులో కేవలం మూడు పాటలు మాత్రమే పాడారు. 1955లో వచ్చిన సంతానం సినిమాలోని నిదురపోరా తమ్ముడా పాటని పాడారు. అమెకి తెలుగులో ఇదే  మొదటిపాట కావడం విశేషం.

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మెయిన్ లీడ్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఇక తెలుగులో రెండో పాటను 1965లో దొరికితే దొంగలు చిత్రంలో శ్రీవేంకటేశా అనే పాటను పాడారు. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, జమున కలిసి నటించారు.

ఇక మూడో పాటను 1988లో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంలో తెల్ల చీరకు తకథిమి అనే పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. నాగార్జున, శ్రీదేవి, సుహాసిని మెయిన్ లీడ్ లో నటించారు.

Also Read :