Kantara : చివరి 20 నిమిషాలు పూనకాలే..!
Cinema Latest

Kantara : చివరి 20 నిమిషాలు పూనకాలే..!

Kantara : కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పడం కష్టం.. వాటిని జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే.. కాంతార (సంస్కృతంలో అడవి అని అర్థం) అలాంటి సినిమానే.. ఇది మనకు తెలియని కథేం కాదు.. కానీ తెరకెక్కించిన తీరు మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.. ఓ అడవి.. అందులో జనం.. దాన్ని లాక్కోవాలని చూసే దొర.. సాధారణంగా ఇలాంటి కథలో కాపాడటానికి హీరో ఉంటాడు.. కానీ కాంతార (Kantara ) సినిమాలో మాత్రం ఆ కాపాడే హీరో.. దేవుడు కావడం కొత్తగా అనిపిస్తుంది.. కన్నడ సంస్కృతి నుంచి ఈ కథ రాసుకున్నాడు రిషభ్ శెట్టి. ఆయనే కథకుడు, నటుడు కావడంతో పని మరింత సులువు అయిపోయింది. ఆ పాత్రను రిషబ్ ఓన్ చేసుకున్న తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అబ్బా ఎంత అద్భుతంగా నటించాడో అని ముచ్చటేస్తుంది.

Image

కన్నడ మూలాల నుంచి ఈ కథ రాసుకున్నట్లు అర్థమవుతుంది.. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చెవుల్లో ఆ శబ్ధాలు మార్మోగిపోతుంటాయి.. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివరి 20 నిమిషాలు మరో ఎత్తు.. మొదటి 20 నిమిషాలు.. ఇంటర్వెల్ ఎపిసోడ్.. క్లైమాక్స్.. హీరోకు దేవుడు పూనినపుడు వచ్చే సన్నివేశాలు.. విజువల్‌గా నెక్ట్స్ లెవల్ అంతే.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం మరో స్థాయిలో ఉంది.. సినిమాకు ప్రాణం అది.. కాంతార సినిమాకు టెక్నికల్ టీం అతి పెద్ద బలం.. దర్శకుడిగా, నటుడిగా రిషభ్ శెట్టికి నూటికి నూరు మార్కులు వేయచ్చు.. మరో కీలక పాత్రలో కిషోర్ అద్భుతంగా నటించాడు.. సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ కారెక్టర్ బాగుంది.

Image

Also Read :

కాంతార ఒక కొత్త ప్రపంచం . హిస్టరీ సినిమా చూస్తున్న ఫీలింగ్ తో మొదలెట్టి హిస్టీరియక్ ఫీలింగ్ తో బయటికి పంపిస్తుంది. దేవత ఆవహించినపుడు అరిచే ఒక అరుపు సినిమా అయిపోయినా కూడా ఇంకా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చర్మం బిగుతుగా మారి రోమాలు నిక్కబొడుచుకుని ఒళ్ళు జలదిరించే ఫీలింగ్ కావాలంటే ఖచ్చితంగా ఈ సినిమాని ధియేటర్లోనే చూడండి.

సినిమాని చూస్తున్నపుడు మాత్రమే కాక ధియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తరువాత కూడా ఆ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, ఎమోషన్లు ఇంకా ఇంకా మనల్ని వెంటాడి మన మనసులో ఆ అనుభూతిని మళ్ళీ మళ్ళీ కలిగించి మనల్ని అదే ట్రాన్స్ లో ఉంచే ఒక అద్భుతమైన సినిమా చూడాలనుకుంటే మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ” కాంతార “.