home page

మళ్ళీ ఇబ్బందుల్లో పావలా శ్యామల... ఇగ మా అసోసియేషన్ ఉండి ఎందుకు దండగ.. !

 | 
మళ్ళీ ఇబ్బందుల్లో పావలా శ్యామల... ఇగ మా అసోసియేషన్ ఉండి ఎందుకు దండగ.. !

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు పావలా శ్యామల.. ముఖ్యంగా బాబాయ్ హోటల్, వర్షం, ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ మొదలగు సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఎంతో నవ్వించారు.. అలాంటి నటి ఇప్పుడు ఆర్థిక, ఆరోగ్య, వయోపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. 

గతంలో ఆమె పరిస్థితిని తెలుసుకున్న సీఎం కేసీఅర్ ఆమెకి ప్రభుత్వం నుంచి నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఆ పెన్షన్ సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదని ఆమె వాపోయారు.. ఆర్థిక కారణాల వల్ల తనకు వచ్చిన అవార్డులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.  

పావలా శ్యామల తో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇలాంటి సమయంలో ఆమెకి ఆర్థిక సహాయం చేయడానికి నటి కరాటే కళ్యాణి ముందుకు వచ్చారు. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సాయం అందేలా ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఆమెను ఆదుకునేందుకు ముందుకు రావాలని చేశారు.

పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల.. సీనియర్ రచయిత గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావలా శ్యామలగా స్థిరపడిపోయింది. ఈ ఒక్క నాటికలోని ఆ పాత్రకు 200 అవార్డులు తీసుకున్నారు. నుపదమూడేళ్ళకే ఆమెకి వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు మూడేళ్ళకే ఈమె భర్త ఘోరప్రమాదంలో కన్నుమూశారు.  

అప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలు. కుటుంబపోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగాఎంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు సంపాదించుకున్నారు.  44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టి.వి.సీరియళ్లలో నటించారు.  ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఈమె ఏ రంగస్థలనటి అందుకోనన్ని అవార్డులు, బహుమతులు అందుకొన్నారు.

అయితే తనని వెలివేసిన బంధువులు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారని మళ్ళీ కష్టాలు మొదలవ్వడంతో మొహం చాటేశారని శ్యామల చెప్పుకొచ్చింది.  ఇప్పుడు మమ్మల్ని పలకరించే దిక్కు లేదని వాపోయింది.  ఇంటి అద్దె కట్టలేకపోయాం. ఓనర్‌ అద్దె కట్టకపోతే ఖాళీ చేయమంటాడు. నా కిడ్నీలు పాడై మంచంలో ఉన్నాను. 

ఆ సమయంలో ఇంటి ఓనర్‌ కరెంటు, నీళ్ళు ఇవ్వకుండా ఆపేశాడు. మానవత్వం లేకుండా వ్యవహరించాడు. అప్పుడే దిల్‌రాజు 50 వేలు ఇస్తే పాత బాకీ కట్టి వేరే ఇంటికి మారానని శ్యామల వాపోయింది. ఇక సాయం కోసం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ వారిని కలవడానికి వెళ్తే మెంబర్‌ వి కాదని సాయం చేయలేమన్నారని చెప్పుకొచ్చింది.