Krishnam Raju : కృష్ణంరాజుకు తీరని కలలు
Cinema Latest

Krishnam Raju : కృష్ణంరాజుకు తీరని కలలు

Krishnam Raju : టాలీవుడ్ మరో సీనియర్ నటుడ్ని కొల్పోయింది. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రేపు అధికార లాంఛనాలతో కృష్ణంరాజు(Krishnam Raju) అంత్యక్రియలు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలో, రాజకీయల్లో ఎలాంటి మచ్చ లేకుండా బతికారు కృష్ణంరాజు. వివాదాల జోలికి ఏనాడూ పోలేదు. బతికినన్నినాళ్ళు నిజంగానే రాజులగా బతికిన కృష్ణంరాజుకు మాత్రం కొన్ని కలలు అలాగే మిగిలిపోయాయి.

ప్రభాస్ ని తన వారసుడిగా టాలీవుడ్ కి పరిచయం చేశారు కృష్ణంరాజు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ప్రభాస్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రభాస్ తో కలిసి మొత్తం మూడు సినిమాల్లో కలిసి నటించిన ఆయన… భక్తకన్నప్ప సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేయాలనీ అనుకున్నారు.. కానీ ఎందుకో కార్యరూపం జరగలేదు. అలాగే మన ఊరి పాండవులు మూవీని కూడా ప్రభాస్ తో రీమేక్ చేయాలనీ అనుకున్నరాయన. మెయిన్ గా ప్రభాస్ పెళ్లి చూడాలని చాలా ఆరాటపడ్డారు. వీలైతే ప్రభాస్ కు పుట్టబోయే పిల్లలతో కూడా నటించాలని అనుకున్నారు. ఇక విశాల నేత్రాలు నవల ఆధారంగా సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.

బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి వాజ్‌పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు గవర్నర్ గా కూడా పనిచేయాలనీ అనుకున్నారు. ఆ మధ్య తమిళనాడు గవర్నర్ గా అవకాశం అంటూ వార్తలు వచ్చాయి కానీ అవి కేవలం ఊహాగానాకే పరిమితం అయ్యాయి.

Also Read :